LOADING...
Microsoft: ₹1,245 కోట్ల లాభం.. FY25లో మైక్రోసాఫ్ట్ ఇండియాకు రికార్డు లాభాలు 
₹1,245 కోట్ల లాభం.. FY25లో మైక్రోసాఫ్ట్ ఇండియాకు రికార్డు లాభాలు

Microsoft: ₹1,245 కోట్ల లాభం.. FY25లో మైక్రోసాఫ్ట్ ఇండియాకు రికార్డు లాభాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2025
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్ ఇండియా ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో రికార్డు లాభాలు నమోదు చేసింది. FY25లో కంపెనీ నికర లాభం ఏకంగా ₹1,245.2 కోట్లు చేరింది. ఇది గతేడాదితో పోల్చితే 38.66% పెరుగుదల. క్లౌడ్ వినియోగం పెరగడం,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సర్వీసులకు డిమాండ్ పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా చెప్పబడుతోంది. మొదటిసారిగా మైక్రోసాఫ్ట్ ఇండియా ₹1,000 కోట్ల లాభ మార్క్ దాటింది. లాభాలతో పాటు రెవెన్యూ కూడా భారీ ఎత్తున పెరిగి ₹29,303 కోట్లు దాటింది.

వివరాలు 

 'ఇన్-కంట్రీ డేటా ప్రాసెసింగ్' ప్రారంభించాలనినిర్ణయించిన మైక్రోసాఫ్ట్

ఇది FY24లోని ₹22,891 కోట్లతో పోల్చితే 28% గ్రోత్. ఈ ఏడాది కంపెనీ మొత్తం ఖర్చులు ₹27,624 కోట్లు గా నమోదయ్యాయి. డిసెంబర్‌లో CEO సత్య నాదెళ్ల భారత్‌ పర్యటనకు ముందే ఈ రికార్డు నెంబర్లు రావడం ప్రత్యేకంగా కనిపిస్తోంది. మరోవైపు, ప్రభుత్వ విభాగాలు, నియంత్రిత రంగాల నుంచి పెరుగుతున్న డేటా భద్రత డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మైక్రోసాఫ్ట్ Microsoft 365 Copilot కోసం 'ఇన్-కంట్రీ డేటా ప్రాసెసింగ్' సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. 2025 చివరి నాటికి 15 దేశాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుండగా, మొదటగా భారతదేశంలోనే ఈ సేవ మొదలుకానుంది.