
Microsoft: ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా నిలిచిన మైక్రోసాప్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా మైక్రోసాప్ట్ నిలిచింది.
టైమ్ మ్యాగజైన్ స్టాటిస్టాతో కలిసి ప్రపంచంలోనే వంద అత్యుత్తమ కంపెనీల జాబితాను తాజాగా ప్రకటించింది. ఇందులో మైక్రోసాప్ట్ అగ్రస్థానంలో నిలవడం విశేషం.
ఇక ఆపిల్, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, మెటా ఫ్లాట్‌ఫామ్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
ఈ జాబితాలో భారత్ నుంచి కేవలం ఒక కంపెనీనే స్థానం దక్కించుకోవడం విశేషం.
దేశీయ టెక్ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ టైమ్ 100 అత్యుత్తమ కంపెనీల జాబితాలో 64వ స్థానంలో నిలిచింది.
Details
భారత్ లో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ ను ఏడుగురు యువ ఇంజినీర్లు 1981లో స్థాపించగా, వారిలో ఎన్.ఆర్.నారాయణ మూర్తి, నందన్ నీలేకని అందరికి సుపరిచితులే.
2020 నాటికి ఆదాయాల ప్రకారం భారత్‌లో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా ఇన్ఫోసిస్ పనిచేసింది.
ఇందులో ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల మంది పనిచేస్తున్నారు. దీని మార్కెట్ విలువ రూ.6.26 లక్షల కోట్లుగా ఉంది.
ఇక యాక్సెంచర్, డెలాయిట్ దీనికంటే ముందు స్థానంలో ఉన్నారు. ఇన్ఫోసిస్ విలువ ఈరోజు 0.34 శాతం పెరిగి రూ.1,512 దగ్గర స్థిరపడింది.
100 అత్యుత్తమ కంపెనీల్లో తొలి 10 ఇవే
మైక్రోసాఫ్ట్, యాపిల్, ఆల్ఫాబెట్, మోటా ప్లాట్‌ఫామ్స్, యాక్సెంచర్, ఫైజర్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిసైట్ డి ఫ్రాన్స్, బీఎండబ్ల్యూ గ్రూప్, డెల్ టెక్నాలజీస్