Congo Gumi: 1,400 సంవత్సరాలుగా నిలకడగా పనిచేస్తున్న జపాన్ కంపెనీ
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, నిరంతరంగా పనిచేస్తున్న సంస్థగా పేరు పొందిన జపాన్‌లోని కాంగో గుమి కంపెనీకి పేరుంది. సుమారు ఈ కంపెనీకి 1,400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. కాంగో కుటుంబానికి చెందిన 40 తరాల వారసత్వంతో నడుస్తున్న ఈ సంస్థ, ప్రధానంగా దేవాలయాలను నిర్మించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ సంస్థ 578 CEలో స్థాపించారు. దేశంలోని తొలి బౌద్ధ దేవాలయమైన షిటెన్నో-జి నిర్మాణం కాంగో గుమి బాధ్యతలోనే జరిగింది. కాంగో గుమి సంస్థ, జపాన్ మత చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
కాంగో కంపెనీకి విశేషాధరణ
బౌద్ధమతం దేశంలోకి ప్రవేశించిన తొలి దశలో, ఆలయాలను నిర్మించగలిగే నైపుణ్యం కలిగిన కళాకారులు లేనందువల్ల, ప్రిన్స్ షోటోకు కొరియన్లు షిగెమిట్సు కాంగో అనే ప్రఖ్యాత బిల్డర్‌ను ఆహ్వానించాడు. షిటెన్నో-జి ఆలయం నిర్మాణానికి ఆయనే పునాది వేసి, కాంగో గుమి సంస్థను స్థాపించారు. 1583లో ఒసాకా కోట నిర్మాణ బాధ్యత కూడా ఈ సంస్థకే అప్పగించింది. రెండవ ప్రపంచ యుద్ధం, బౌద్ధమతం క్షీణత వంటి ప్రతికూల పరిణామాలను ఎదుర్కొన్నప్పటికీ, కాంగో గుమి సంస్థ విశేష స్థితిస్థాపకతను ప్రదర్శించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా, శవపేటికలను తయారు చేయడం వంటి కొత్త వ్యాపారాల వైపు దృష్టి సారించింది.
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కాంగో కంపెనీ
2006 జనవరిలో తకమాట్సు కన్‌స్ట్రక్షన్ గ్రూప్‌కు అనుబంధంగా మారినప్పటికీ, సంస్థ తన సాంప్రదాయ మియాడైకు (నిర్మాణ కళ) హస్తకళను కాపాడుకుంటూ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం కాంగో గుమి సంస్థలో 41వ చీఫ్‌గా వ్యవస్థాపక కుటుంబం నుంచి ఒక సభ్యుడు మాత్రమే ఉన్నారు. సంస్థ ఎనిమిది స్వయంప్రతిపత్త సమూహాలుగా విభజించారు. వీటిలో పురాతన సాధనాలు, సాంకేతికతలతో మియాడైకు కళను కొనసాగిస్తున్నారు. కాలం మారుతున్న ఈ ప్రాచీన సంప్రదాయాలను కాపాడుకుంటూ, అత్యున్నత స్థాయి హస్తకళకు కాంగో గుమి సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.