LOADING...
MobiKwik: మోబిక్విక్‌కు ఆర్‌బీఐ నుంచి NBFC లైసెన్స్.. వినియోగదారులకు ఏం లాభం?
మోబిక్విక్‌కు ఆర్‌బీఐ నుంచి NBFC లైసెన్స్.. వినియోగదారులకు ఏం లాభం?

MobiKwik: మోబిక్విక్‌కు ఆర్‌బీఐ నుంచి NBFC లైసెన్స్.. వినియోగదారులకు ఏం లాభం?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 27, 2026
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిన్‌టెక్ సంస్థ మోబిక్విక్‌కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌ బి ఐ) నుంచి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్స్‌కు అనుమతి లభించింది. దీంతో మోబిక్విక్ తన పూర్తిస్థాయి అనుబంధ సంస్థ ద్వారా స్వంత రుణ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. కంపెనీ తన నియంత్రిత రుణ సేవలను విస్తరించడంతో పాటు వినియోగదారులు, వ్యాపారులకు కొత్త క్రెడిట్ ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ లైసెన్స్‌తో మోబిక్విక్ ఆర్థిక సేవలను మరింత బలోపేతం చేసుకోగలదు. రుణాల ద్వారా వచ్చే ఆదాయం పెరగడంతో పాటు కొత్త ఉత్పత్తులను వేగంగా మార్కెట్లోకి తీసుకురావచ్చు.

వివరాలు 

ఎన్‌బీఎఫ్‌సీ ఉండటం వల్ల సెక్యూర్డ్,ఆన్ సెక్యూర్డ్ రుణాలు 

మోబిక్విక్ సహ వ్యవస్థాపకురాలు ఉపాసన టాకు ప్రకారం, ఈ అనుమతి సంస్థను పెద్ద స్థాయి ఆర్థిక సేవల వేదికగా తీర్చిదిద్దడంలో కీలకమైన అడుగు. ఇక సంస్థలోనే ఎన్‌బీఎఫ్‌సీ ఉండటం వల్ల సెక్యూర్డ్(పూచీకత్తుతో ఇచ్చే రుణాలు), ఆన్ సెక్యూర్డ్ (పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాలు) రుణాలను వేగంగా అందించవచ్చు. అలాగే కో-లెండింగ్ భాగస్వామ్యాల ద్వారా స్థిరమైన నిధులను సమీకరించే అవకాశం ఉంటుంది. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీల సహాయంతో వినియోగదారులకు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఆర్థిక ఉత్పత్తులను అందించడమే కాకుండా, ముఖ్యంగా టియర్-2, టియర్-3 నగరాల్లో రుణాల ప్రాప్తిని విస్తరించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.

Advertisement