Page Loader
DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 3 శాతం డీఏకు గ్రీన్ సిగ్నల్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 3 శాతం డీఏకు గ్రీన్ సిగ్నల్

DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 3 శాతం డీఏకు గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2024
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పబోతున్నది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని (డీఏ - Dearness Allowance) 3 శాతం పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ మధ్యాహ్నం తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తాజా పెంపుతో ఇప్పటి వరకు ఉన్న 50 శాతం డీఏ 53 శాతానికి చేరనున్నది.ఈ ఏడాది జులై 1వ తేదీ నుండి దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. డీఏ పెంపుతో దాదాపు కోటి మంది ఉద్యోగులు,పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నట్లు తెలుస్తోంది. గతంలో, సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చిలో డీఏను 4 శాతం పెంచిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బొనాంజా