Moody's-GDP: భారత్ వృద్ధిరేటు అంచనాలలో కోత.. ఏడు శాతానికే పరిమితం అంటున్న మూడీ'స్..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీ'స్ (Moody's) భారత్ వృద్ధిరేటు అంచనాలను తగ్గించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో వృద్ధిరేటు 7 శాతమే ఉంటుందని పేర్కొంది.
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో వృద్ధిరేటు 8.2 శాతం ఉండగా, ప్రస్తుత వృద్ధి దీనికి తక్కువగా ఉందని వెల్లడించింది.
జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఈ అంచనాలను తగ్గించినట్టు మూడీ'స్ తెలియజేసింది.
అయితే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొనసాగుతుందని చెప్పింది. 2023-24తో పోల్చితే తలసరి ఆదాయం 10,233 డాలర్లకు చేరి 11 శాతం పెరిగినట్టు వెల్లడించింది.
వివరాలు
2025-26లో జీడీపీ వృద్ధి రేటు 7.2శాతం నుంచి 7శాతానికి పరిమితం
ఇది మాత్రమే కాకుండా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటును 7 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గించి అంచనా వేసింది.
2023-24లో జీడీపీ 8.2 శాతంగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు గణనీయంగా తగ్గుముఖం పట్టింది.
గత డిసెంబర్‌లో ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB)కూడా భారత్ వృద్ధిరేటు అంచనాలను సవరించింది.
2023-24లో భారత్ వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంటుందని,పారిశ్రామిక వృద్ధి బలహీనం, ప్రభుత్వ వ్యయంలో తగ్గింపు వంటి అంశాలు దీనికి కారణమని పేర్కొంది.
ఇండ్ల డిమాండ్‌పై కఠిన ద్రవ్య పరపతి విధానం ప్రభావం చూపుతుందని,2025-26లో జీడీపీ వృద్ధి రేటు 7.2శాతం నుంచి 7శాతానికి పరిమితం అవుతుందని వివరించింది.