Mukesh Ambani: ఆరు ఏళ్లుగా జీతం తీసుకొని ముఖేష్ అంబానీ.. అయినా బిలియన్ల సంపద సొంతం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచిన వ్యాపారవేత్త ముకేష్ అంబానీ గత ఆరు సంవత్సరాలుగా జీతం తీసుకోవడం లేదు. అయినప్పటికీ ఆయన సంపద మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక, సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి జీతాన్ని వదులుకోవాలని ఆయన నిర్ణయించారు. అయితే అంతకుముందు ముఖేష్ అంబానీ వార్షిక వేతనం రూ.15 కోట్లుగా ఉండేది. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచే ఆయన తన జీతాన్ని రూ.15 కోట్లకే పరిమితం చేసుకున్నారు. అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపారం, లాభాలు గణనీయంగా పెరిగినా కూడా దాదాపు 12 సంవత్సరాల పాటు అదే జీత పరిమితిని కొనసాగించారు.
వివరాలు
ముఖేష్ అంబానీకి పేరిట 16.1 మిలియన్ల షేర్లు
జీతం తీసుకోకపోయినా ముఖేష్ అంబానీ సంపద పెరగడానికి ప్రధాన కారణం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కుటుంబానికి ఉన్న భారీ వాటా. కంపెనీ షేర్ ధర పెరిగే కొద్దీ ఆయన నికర ఆస్తి విలువ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా, డివిడెండ్లు ఆయనకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. కంపెనీ లాభాల్లో భాగంగా వాటాదారులకు డివిడెండ్ చెల్లిస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ముఖేష్ అంబానీకి సుమారు 16.1 మిలియన్ షేర్లు ఉన్నట్లు సమాచారం. FY2025లో కంపెనీ ఒక్కో షేర్‌కు రూ.6 డివిడెండ్ ప్రకటించడంతో ఆయనకు సుమారు రూ.96.6 మిలియన్ల ఆదాయం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఆదాయం (Income) మరియు నికర ఆస్తి విలువ (Net Worth) రెండూ వేర్వేరు అంశాలని నిపుణులు చెబుతున్నారు.