Page Loader
Mukesh Ambani: హురున్‌ జాబితాలో ముఖేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ.. టాప్-10లో దక్కని చోటు
హురున్‌ జాబితాలో ముఖేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ.. టాప్-10లో దక్కని చోటు

Mukesh Ambani: హురున్‌ జాబితాలో ముఖేశ్‌కు గట్టి ఎదురుదెబ్బ.. టాప్-10లో దక్కని చోటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ 2025లో భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ టాప్-10 స్థానం కోల్పోయారు. గతేడాది అప్పులు పెరగడం వల్ల ఆయన సంపద రూ.1 లక్ష కోట్ల మేర తగ్గిందని ఈ జాబితా పేర్కొంది. అయినా ఆసియాలో అత్యంత సంపన్నుడి హోదాను ఆయన కాపాడుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సంపద 82 శాతం పెరిగి 420 బిలియన్ డాలర్లకు చేరి అగ్రస్థానంలో నిలిచారు. 266 బిలియన్‌ డాలర్లతో అమెజాన్ అధిపతి జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) రెండో స్థానంలో ఉన్నారు. మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg) 242 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలిచారు.

Details

 భారత మహిళల్లో రోష్ని నాడార్‌ టాప్-10లోకి 

ఆ తర్వాత ఒరాకిల్‌ సీఈవో లారీ ఎల్లిసన్‌, ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌, గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్‌ ఉన్నాయి. హెచ్‌సీఎల్‌ అధినేత శివ్‌నాడార్‌ కుమార్తె రోష్ని నాడార్‌ రూ.3.5 లక్షల కోట్ల సంపదతో ప్రపంచ సంపన్న మహిళల టాప్-10లో చోటు దక్కించుకున్నారు. తండ్రి నుంచి హెచ్‌సీఎల్‌లో 47% వాటా పొందడంతో ఆమె ఐదో స్థానానికి చేరారు.

Details

 భారత సంపన్నుల జాబితా.. అంబానీనే నంబర్-1 

భారత జాబితాలో ముఖేశ్‌ అంబానీ కుటుంబం తొలి స్థానంలో కొనసాగుతోంది. వారి సంపద 13 శాతం తగ్గి రూ.8.6 లక్షల కోట్లుగా ఉంది. ఆ తర్వాత గౌతమ్‌ అదానీ కుటుంబం(రూ.8.4 లక్షల కోట్లు), రోష్ని నాడార్‌ కుటుంబం(రూ.3.5 లక్షల కోట్లు), దిలీప్‌ సంఘ్వీ కుటుంబం(రూ.2.5 లక్షల కోట్లు), అజీమ్‌ ప్రేమ్‌జీ కుటుంబం (రూ.2.2 లక్షల కోట్లు) టాప్-5లో ఉన్నారు. భారత బిలియనీర్ల సంఖ్య పెరిగింది గతేడాదితో పోలిస్తే భారత బిలియనీర్ల సంఖ్య 45 మంది పెరిగి 284కి చేరింది. వీరి కలిపి సంపద విలువ రూ.98 లక్షల కోట్లుగా ఉంది. ముంబయి 90 బిలియనీర్లతో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచింది. - 'బిలియనీర్స్ క్యాపిటల్ ఆఫ్ ఆసియా' హోదాను చైనాలోని షాంఘై దక్కించుకుంది.