Bank: బ్యాంకింగ్ సవరణ చట్టం 2025: ఓ ఖాతాదారుని కోసం నాలుగు నామినీలు నియమించుకునే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
బ్యాంకింగ్ సవరణ చట్టం 2025లో కొన్ని కొత్త నియమాలు ఈ ఏడాది నవంబర్ 1 నుండి అమలులోకి వస్తాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అందువల్ల వచ్చే నెల నుంచి బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లు,బ్యాంక్ కస్టడీలో ఉంచిన వస్తువులు,సేఫ్టీ లాకర్లు ఇలా అన్ని విషయంలో ఈ కొత్త నియమాలు వర్తించనున్నాయి. కొత్త నియమాల ప్రకారం,బ్యాంక్ ఖాతాదారులు ఒకేసారి నాలుగు నామినీలను కూడా నియమించుకోవచ్చు. ఒక్కొక్క నామినీకి ఎంత శాతం వాటా ఇవ్వాలో ఖాతాదారు స్పష్టంగా నిర్ణయించుకోవచ్చు. మొత్తం వాటా 100% ఉండేలా చూసుకోవడం తప్పనిసరి. దీని ద్వారా పంపకంలో ఎటువంటి సమస్యలు తలెత్తవు. అంతేకాకుండా, క్యాష్ డిపాజిట్ అకౌంట్లలో, నామినీలను ఒక్కసారి లేదా తరువాత ఒకరిని ఆ తర్వాత మరొకరిని ఇలా ఎంచుకోవచ్చు.
వివరాలు
నామినీ మరణించిన తర్వాత వారసత్వ ఆస్తుల విషయంలో కూడా స్పష్టత
బ్యాంక్ కస్టడీలో ఉంచిన వస్తువులు లేదా సేఫ్టీ లాకర్లలోని వస్తువుల కోసం, ప్రధాన నామినీ చనిపోతే మాత్రమే సెకండరీ నామినీగా నాలుగు నామినీలను మాత్రమే అనుమతిస్తారు. ఈ కొత్త నియమాల వల్ల ఖాతాదారులకు కావలసిన విధంగా నామినీలను ఎంచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అదేవిధంగా, నామినీలకు డబ్బు లేదా వస్తువుల క్లెయిమ్ వేగంగా, సులభంగా పరిష్కరించబడుతుంది. నామినీ మరణించిన తర్వాత వారసత్వ ఆస్తుల విషయంలో కూడా స్పష్టత ఏర్పడుతుంది. అన్ని బ్యాంకులలో ఈ నియమాలు సమానంగా అమలు చేయడానికి, త్వరలో బ్యాంకింగ్ నామినేషన్ నియమాలు 2025 అధికారికంగా విడుదల కానున్నాయి. ఈ చట్టం బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడం, ఖాతాదారులు, పెట్టుబడిదారులను రక్షించడం, మెరుగైన నామినీ సౌకర్యాలను అందించడం లక్ష్యంగా తీసుకొచ్చారు.