Loading...
Musk: స్పేస్‌ఎక్స్‌ షేర్లు 8 శాతం జంప్‌.. మళ్లీ ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్
స్పేస్‌ఎక్స్‌ షేర్లు 8 శాతం జంప్‌.. మళ్లీ ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్

Musk: స్పేస్‌ఎక్స్‌ షేర్లు 8 శాతం జంప్‌.. మళ్లీ ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

స్పేస్‌-X షేర్లు సోమవారం దాదాపు 8 శాతం పెరిగి.. జూన్‌ మధ్య తర్వాత అత్యధిక స్థాయికి చేరాయి. గత వారం నాసా కోసం మానవ సహిత మిషన్‌తో పాటు గూగుల్‌కు చెందిన ఏఐ చిప్‌లను కక్ష్యలోకి విజయవంతంగా పంపడంతో కంపెనీ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఆగస్టులో కనిష్ఠ స్థాయికి పడిపోయిన తర్వాత స్పేస్‌ఎక్స్‌ షేర్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. తాజాగా షేర్‌ ధర భారీగా పెరగడంతో కంపెనీ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ మరోసారి ట్రిలియనీర్‌ క్లబ్‌లోకి అడుగుపెట్టారు.

వివరాలు 

స్పేస్‌ఎక్స్‌ షేర్లకు 300 డాలర్ల టార్గెట్‌ ఇచ్చిన మోర్గాన్‌ స్టాన్లీ

స్పేస్‌ఎక్స్‌ షేర్లలో ఇటీవల వచ్చిన ర్యాలీకి మోర్గాన్‌ స్టాన్లీ విశ్లేషకుల నివేదిక కూడా మరింత ఊతమిచ్చింది.

ప్రస్తుత ధరల వద్ద కంపెనీ షేర్లు తక్కువ విలువలో ఉన్నాయని వారు పేర్కొన్నారు.

భవిష్యత్తులో విడుదల కానున్న ఏఐ ఉత్పత్తులు, స్టార్‌షిప్‌ పురోగతి, మరిన్ని నియోక్లౌడ్‌ కాంట్రాక్టులు కంపెనీకి కీలకంగా మారనున్నాయని తెలిపారు.

స్పేస్‌ఎక్స్‌ షేర్లకు 300 డాలర్ల టార్గెట్‌ ధరను నిర్ణయించారు.

సోమవారం మార్కెట్‌ ముగిసే సమయానికి నమోదైన 171.09 డాలర్లతో పోలిస్తే ఇది దాదాపు 75 శాతం అధికం.

వివరాలు 

స్టార్‌షిప్‌ తదుపరి పరీక్షకు ముందే షేర్లు కొనొచ్చన్న విశ్లేషకులు

స్పేస్‌ఎక్స్‌ భారీ స్టార్‌షిప్‌ రాకెట్‌ తదుపరి పరీక్షా ప్రయోగానికి ముందే కంపెనీ షేర్లను కొనుగోలు చేయాలని మోర్గాన్‌ స్టాన్లీ విశ్లేషకులు సూచించారు.

అక్టోబర్‌ చివర్లో వెలువడే అవకాశం ఉన్న మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలకు ముందుగానూ షేర్లను కొనుగోలు చేయవచ్చని తెలిపారు.

స్టార్‌షిప్‌ స్పేస్‌ఎక్స్‌ రూపొందిస్తున్న తదుపరి తరం అంతరిక్ష నౌక. ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద రాకెట్‌గా దీనిని పేర్కొంటున్నారు.

దీని ప్రత్యేకత ఏమిటంటే.. పై దశతో పాటు బూస్టర్‌ను కూడా తిరిగి భూమిపై సురక్షితంగా ల్యాండ్‌ చేయగలిగేలా పూర్తిగా పునర్వినియోగించే విధంగా దీనిని రూపొందించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఏఐ వ్యాపారంతో స్పేస్‌ఎక్స్‌కు పెరుగుతున్న ఆదాయం

స్పేస్‌ఎక్స్‌ ఆదాయానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వ్యాపారం కూడా ఇప్పుడు మరింతగా తోడ్పడుతోంది. గత ఏడాది మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐని కొనుగోలు చేయడం ద్వారా ఈ వ్యాపారం స్పేస్‌ఎక్స్‌లోకి వచ్చింది.

ఇటీవల కర్సర్‌ను కొనుగోలు చేయడంతో ఈ విభాగం మరింత విస్తరించింది.

ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్‌ వంటి ప్రముఖ సంస్థల ఏఐ మోడళ్లతో పోలిస్తే స్పేస్‌ఎక్స్‌కు చెందిన గ్రోక్‌ మోడల్‌ అంతగా ఆదరణ పొందకపోయినప్పటికీ.. గూగుల్‌, ఆంత్రోపిక్‌ వంటి సంస్థలకు కంప్యూటింగ్‌ సామర్థ్యాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా స్పేస్‌ఎక్స్‌ భారీగా ఆదాయం పొందుతోంది.

ADVERTISEMENT