
Elon Musk: మస్క్‌కు మరోసారి చుక్కెదురు.. $101bn టెస్లా పే ప్యాకేజీకి కోర్టు నో..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌కు వేతన ప్యాకేజీ విషయంలో మరోసారి సమస్యలు ఎదురయ్యాయి.
55.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 4.5 లక్షల కోట్లు) ప్యాకేజీపై డెలవేర్ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా మళ్లీ సమర్థించింది.
టెస్లా సంస్థ షేర్‌హోల్డర్ల ద్వారా ఈ డీల్‌కు ఆమోదం పొందే ప్రయత్నాన్ని న్యాయస్థానం తిరస్కరించింది.
ఇంత పెద్ద ప్యాకేజీని మంజూరు చేయడం వాటాదారుల హక్కులకు అన్యాయం చేస్తుందని కోర్టు అభిప్రాయపడింది.
వివరాలు
ఏమిటి ఈ వివాదం?
2018లో ఎలాన్ మస్క్ కార్పొరేట్ చరిత్రలోనే అత్యధికమైన 55.8 బిలియన్ డాలర్ల వార్షిక వేతన ప్యాకేజీ పొందారు.
ఈ పరిణామంతో మస్క్ ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ముందంజలో నిలిచారు.
అయితే, ఈ భారీ ప్యాకేజీపై అభ్యంతరం వ్యక్తం చేసిన టెస్లా వాటాదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా, దీనిపై కోర్టును ఆశ్రయించారు.
ఈ ప్యాకేజీతో కార్పొరేట్ ఆస్తులు వృథా అవుతున్నాయని, మస్క్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి డైరెక్టర్లను ప్రభావితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ కేసుపై విచారణ జరిపిన డెలవేర్ కోర్టు, మస్క్‌కు అంతటి భారీ వేతనం ఇచ్చే న్యాయసమ్మతమైన ఆధారాలు లేవని తేల్చింది.
వివరాలు
తాజా కోర్టు తీర్పు
ఈ ఏడాది జనవరిలో కోర్టు, మస్క్‌కు ఆ ప్యాకేజీ అర్హం కాదని స్పష్టం చేసింది. అయితే, జూన్‌లో జరిగిన టెస్లా వార్షిక సమావేశంలో ఈ ప్యాకేజీకి మళ్లీ ఓటింగ్ నిర్వహించారు.
వాటాదారుల మద్దతుతో అదే ప్యాకేజీకి ఆమోదం పొందించారు.
ఈ ప్యాకేజీపై కోర్టు ముందుకొచ్చిన పిటిషన్‌ను మరోసారి తిరస్కరించింది.
టెస్లా చేసిన ఈ ప్రయత్నం వాటాదారులకు న్యాయం చేయడం కాదని కోర్టు అభిప్రాయం వ్యక్తంచేసింది.
అంతేకాదు, మస్క్ అటార్నీ ఫీజులుగా 345 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ ఆదేశించింది.
వివరాలు
మస్క్ స్పందన
తాజా తీర్పుపై ఎలాన్ మస్క్ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌లో స్పందించారు.
"వాటాదారుల ఓట్లకు గౌరవం ఇవ్వడం కోర్టుల బాధ్యత కాదు" అని వ్యాఖ్యానించారు.
టెస్లా కూడా దీనిపై పైకోర్టులో అప్పీల్ చేసేందుకు సిద్దమవుతుందని తెలిపింది.
ఈ వివాదం కార్పొరేట్ ప్రపంచంలో మస్క్ విధానాలపై కొత్త చర్చలకు దారితీసింది.