LOADING...
Elon Musk: ఇన్‌స్టాగ్రామ్‌పై మస్క్ వివాదాస్పద కామెంట్స్.. నెటిజన్ల ఆగ్రహం
ఇన్‌స్టాగ్రామ్‌పై మస్క్ వివాదాస్పద కామెంట్స్.. నెటిజన్ల ఆగ్రహం

Elon Musk: ఇన్‌స్టాగ్రామ్‌పై మస్క్ వివాదాస్పద కామెంట్స్.. నెటిజన్ల ఆగ్రహం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 17, 2026
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్ మస్క్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదానికి కేంద్రబిందువయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌ కేవలం అమ్మాయిల కోసం మాత్రమేనంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. సోషల్ మీడియా అలవాట్లు, ఆన్‌లైన్ ట్రెండ్స్‌కు సంబంధించిన ఒక వైరల్ చర్చకు స్పందించిన మస్క్‌.. పురుషులను ఎగతాళి చేసేలా కామెంట్లు చేసినట్లు నెటిజన్లు విమర్శిస్తున్నారు. మనుషుల ఆన్‌లైన్ అలవాట్లు వారి జీవితంలోని విభిన్న దశలను ఎలా ప్రతిబింబిస్తాయనే అంశంపై సోషల్ మీడియాలో ఓ చర్చ నడిచింది. ఇందులో రోజంతా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు పెట్టడం, ఇంట్లో తయారు చేసిన వంటకాల ఫోటోలు షేర్ చేయడం, ఆకర్షణీయమైన ఫొటోలు పోస్ట్ చేయడం వంటి సాధారణ ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్స్‌ ప్రస్తావనకు వచ్చాయి.

వివరాలు

మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ చర్చకు స్పందించిన మస్క్‌.. "కొంతమంది పురుషులు తమ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్‌ను నాకు పంపుతుంటారు. అప్పుడు వాళ్లు లింగమార్పిడి చేయించుకుంటున్నారా అనే అనుమానం వస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మస్క్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు స్త్రీ ద్వేషపూరితంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. "ఆ పురుషులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న మహిళలు కావచ్చు. అక్కడ కనిపించేది అంతా ఫేక్ మాత్రమేనంటూ కామెంట్ చేశారు.

Advertisement