LOADING...
Elon Musk: అపర కుబేరుడిగా ఎలాన్ మస్క్ రికార్డు… 600 బిలియన్ డాలర్లు దాటిన నెట్ వర్త్
600 బిలియన్ డాలర్లు దాటిన నెట్ వర్త్

Elon Musk: అపర కుబేరుడిగా ఎలాన్ మస్క్ రికార్డు… 600 బిలియన్ డాలర్లు దాటిన నెట్ వర్త్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 16, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోని అపార ధనవంతుల్లో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. 600 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 49.8 లక్షల కోట్లకు పైగా) దాటిన సంపదను సాధించిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారని ఫోర్బ్స్ వెల్లడించింది. మస్క్ స్థాపించిన అంతరిక్ష సంస్థ స్పేస్‌-X విలువ భారీగా పెరిగి, దాదాపు 800 బిలియన్ డాలర్లకు చేరిందన్న అంచనాలు, ఆ సంస్థ ఐపీఓకు సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఆయన సంపద ఈ స్థాయికి ఎగబాకింది.

వివరాలు 

అక్టోబర్ నెలలోనే తొలిసారిగా మస్క్ సంపద 500 బిలియన్ డాలర్ల మార్క్

ఇదే ఏడాది అక్టోబర్ నెలలోనే తొలిసారిగా మస్క్ సంపద 500 బిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. ఆ తర్వాత కేవలం రెండు నెలల వ్యవధిలోనే మరో 100 బిలియన్ డాలర్లు ఆయన నెట్ వర్త్‌కు చేరాయి. ప్రస్తుతం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి,రెండో స్థానంలో ఉన్న ధనవంతుడి మధ్య సుమారు 400 బిలియన్ డాలర్ల భారీ అంతరం ఏర్పడింది. మస్క్ సంపద పెరుగుదలకు ప్రధాన కారణాల్లో ముందుగా స్పేస్‌ఎక్స్ నిలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సంస్థ పబ్లిక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని రాయిటర్స్ గత వారం నివేదించింది. స్పేస్‌ఎక్స్‌లో మస్క్‌కు దాదాపు 42 శాతం వాటా ఉండటంతో, సంస్థ విలువ పెరిగిన కొద్దీ ఆయన సంపద కూడా గణనీయంగా పెరిగింది.

వివరాలు 

677బిలియన్ డాలర్ల  నెట్ వర్త్ 

సోమవారం సాయంత్రానికి స్పేస్‌ఎక్స్ విలువ పెరుగుదల వల్ల మాత్రమే మస్క్ సంపదకు అదనంగా 168 బిలియన్ డాలర్లు చేరినట్లు అంచనా. దీంతో ఆయన మొత్తం నెట్ వర్త్ సుమారు 677బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలుస్తోంది. ఇక టెస్లా కూడా మస్క్ సంపద పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లాలో ఆయనకు సుమారు 12శాతం వాటా ఉంది. ఈ ఏడాది టెస్లా అమ్మకాలు కొంత మందగించినా,కంపెనీ షేర్లు ఇప్పటివరకు దాదాపు 13 శాతం లాభపడ్డాయి. తాజాగా ఫ్రంట్ ప్యాసింజర్ సీటులో సేఫ్టీ మానిటర్లు లేకుండానే 'రోబోటాక్సీల'ను పరీక్షిస్తున్నామని మస్క్ ప్రకటించిన తర్వాత, సోమవారం ఒక్కరోజే టెస్లా షేర్లు సుమారు 4 శాతం పెరిగి ఈ ఏడాది గరిష్ఠ స్థాయిని తాకాయి.

Advertisement

వివరాలు 

అతి పెద్ద పే ప్యాకేజీ..

ఈ పరిణామం కూడా మస్క్ నెట్ వర్త్ 600 బిలియన్ డాలర్లను దాటడానికి దోహదపడిందని విశ్లేషకులు చెబుతున్నారు. అదేవిధంగా మస్క్‌కు లభించిన అతి భారీ పే ప్యాకేజీ కూడా చర్చనీయాంశమైంది. టెస్లాను ఏఐ,రోబోటిక్స్ రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే ఆయన లక్ష్యానికి పెట్టుబడిదారులు మద్దతు తెలుపుతూ,గత నవంబర్‌లో టెస్లా షేర్‌హోల్డర్లు ఆయనకు 1 ట్రిలియన్ డాలర్ల పే ప్యాకేజీ ప్రణాళికను ఆమోదించారు. ఇది కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద వేతన ప్యాకేజీగా గుర్తింపు పొందింది. ఇంకా మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ xAI కూడా తాజా వార్తల్లో నిలుస్తోంది.

Advertisement

వివరాలు 

ప్రపంచంలోనే టాప్​ 10 ధనవంతులు.. 

మీడియా కథనాల ప్రకారం, ఈ సంస్థ సుమారు 230 బిలియన్ డాలర్ల విలువతో, కొత్త ఈక్విటీ రూపంలో 15 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించేందుకు చర్చలు జరుపుతోంది. ఈ తాజా పరిణామాలపై ఎలాన్ మస్క్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఎలాన్​ మస్క్ (టెస్లా, స్పేస్​ఎక్స్​ సీఈఓ)​- 677 బిలియన్​ డాలర్లు ల్యారీ పేజ్​ (గూగుల్​ కో ఫౌండర్​ )- 266 బిలియన్​ డాలర్లు జెఫ్​ బెజోజ్​ (అమెజాన్​ ఫౌండర్​)- 249 బిలియన్​ డాలర్లు సర్గే బ్రిన్​ (గూగుల్​ కో ఫౌండర్​)- 247 బిలియన్​ డాలర్లు ల్యారీ ఎల్లిసన్​ (ఒరాకిల్​ కో ఫౌండర్​)- 243 బిలియన్​ డాలర్లు

వివరాలు 

ప్రపంచంలోనే టాప్​ 10 ధనవంతులు.. 

మార్క్​ జుకర్​బర్గ్​ (ఫేస్​బుక్​ ఓనర్​)- 228 బిలియన్​ డాలర్లు బెర్నాడ్​ ఆర్నాల్ట్​ (ఎల్​వీఎంహెచ్​)- 202 బిలియన్​ డాలర్లు స్టీవ్​ బాల్మర్​ (మైక్రోసాఫ్ట్​ మాజీ సీఈఓ)- 167 బిలియన్​ డాలర్లు జెన్సన్​ హుంగ్​ (ఎన్​వీడియా కో ఫౌండర్​, సీఈఓ)- 152 బిలియన్​ డాలర్లు వారెన్​ బఫెట్​ (బర్క్​షైర్​ హతావే ఫౌండర్​)- 150 బిలియన్​ డాలర్లు

Advertisement