Nayara Energy: పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నయారా ఎనర్జీ.. ఎంత పెరిగాయంటే?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 03, 2026
05:06 pm
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటెయిలర్ నయారా ఎనర్జీ (Nayara Energy) పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.5, డీజిల్ ధరను రూ.3 చొప్పున పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. పెంచిన కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని నయారా ఎనర్జీ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలోనే నయారా ఎనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే స్థానిక పన్నుల ఆధారంగా ధరల పెంపు రాష్ట్రాల వారీగా మారనుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌లను నయారా ఎనర్జీ నిర్వహిస్తోంది. కాగా, ఈ ఏడాది మార్చిలోనూ కంపెనీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన విషయం తెలిసిందే.