
Neville Tata: టాటా రిటైల్‌లో కొత్త తరానికి బాధ్యతలు.. నెవిల్లే టాటా ఎవరంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
టాటా గ్రూప్‌లోని కొత్త తరం నాయకత్వం మొదలైంది. స్టార్ బజార్ హెడ్‌గా 32 ఏళ్ల నెవిల్లే టాటా బాధ్యతలు చేపట్టారు.
ఇంతకీ ఎవరీ నెవిల్లే టాటా? రతన్ టాటాకు ఏమవుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.
స్టార్ బజార్ అనేది ట్రెంట్ లిమిటెడ్ హైపర్ మార్కెట్ యూనిట్, ఇది టాటా గ్రూప్ రిటైల్ వ్యాపారంలో భాగం.
నెవిల్లే టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటాకు సవతి సోదరుడు,ట్రెంట్ లిమిటెడ్ ఛైర్మన్ నోయెల్ టాటా కుమారుడు.
గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌కి రతన్ టాటా చైర్మన్. ట్రెంట్ హైపర్‌మార్కెట్ బోర్డులో నెవిల్లే నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఈ పదవికి రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
వివరాలు
2016లో ట్రెంట్ లిమిటెడ్‌లో నెవిల్లే
నివేదికల ప్రకారం, అయన కొన్నేళ్ల క్రితం నుండి హైపర్ మార్కెట్ వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్నాడు. తరువాత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు.
ట్రెంట్ లిమిటెడ్ తన తదుపరి వృద్ధి ప్రాంతంగా హైపర్ మార్కెట్ వ్యాపారాన్ని ఎంచుకుంది. ట్రెంట్ లిమిటెడ్ సీఈఓగా పి వెంకటేశం ఉన్నారు.
స్టార్ మార్కెట్‌తో పాటు వెస్ట్ సైడ్, జుడియో, జరా వ్యాపారాలు నిర్వహిస్తోంది. బేయెస్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన నెవిల్లే 2016లో ట్రెంట్ లిమిటెడ్‌లో చేరారు.
తొలుత ఫుడ్, బేవరేజెస్ వ్యాపారంలో నిమగ్నమయ్యారు. తదనంతరం,దుస్తుల వ్యాపారమైన జుడియో నిర్వహణ కార్యకలాపాలు చూశారు.ఇది నేడు దేశంలోని ప్రముఖ దుస్తుల బ్రాండ్‌లలో ఒకటి.
వివరాలు
నోయెల్ టాటా కుమార్తెలు కూడా టాటా గ్రూప్ సంస్థల్లో యాక్టివ్‌గా ఉన్నారు
మీడియా నివేదికల ప్రకారం,ట్రెంట్ హైపర్ మార్కెట్ బోర్డులో సభ్యుడిగా ఉన్న నెవిల్లే.. ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు చేపట్టడంలో భాగంగా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వైదొలిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నోయెల్ టాటా కుమార్తెలు లియా టాటా, మాయా టాటా టాటా గ్రూప్ కంపెనీలలో పనిచేస్తున్నారు.
39 ఏళ్ల లియా టాటాకు ఇటీవలే గేట్‌వే బ్రాండ్ ఇండియన్ హోటల్స్ బాధ్యతలు అప్పగించారు.
మాయా టాటా, 36, కొత్త టెక్నాలజీ, అనలిటిక్స్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. టాటా డిజిటల్‌లో పని చేస్తున్నారు.
ఈ ముగ్గురూ టాటా గ్రూపునకు చెందిన వివిధ ట్రస్టులకు ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు.