Page Loader
Credit Card Rule : జూలై నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్సీ, కోటక్ వినియోగదారులకు అలర్ట్!
జూలై నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్సీ, కోటక్ వినియోగదారులకు అలర్ట్!

Credit Card Rule : జూలై నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు.. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్సీ, కోటక్ వినియోగదారులకు అలర్ట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 28, 2025
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఓ కీలక సమాచారం! జూలై 2025 నుంచి ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో మార్పులు చేయనున్నాయి. SBI, HDFC, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు ఈ మార్పులను అధికారికంగా ప్రకటించాయి. అందువల్ల ఆయా బ్యాంకులకు చెందిన కార్డ్ హోల్డర్లు ఈ మార్పులపై పూర్తిగాఅవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. SBI కార్డులో కీలక మార్పులు జూలై 15, 2025 నుంచి SBI కార్డు హోల్డర్లకు సంబంధించి కొన్ని ప్రధాన మార్పులు అమల్లోకి వస్తున్నాయి ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ నిలిపివేత రూ. 1 కోటి విలువైన ఉచిత విమాన ప్రమాద బీమా కవరేజీని ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, మైల్స్ ఎలైట్, మైల్స్ ప్రైమ్ కార్డులపై తొలగించనున్నారు.

Details

రూ.50లక్షల బీమా నిలిపివేత

ఇప్పటివరకు అందుతున్న రూ. 50 లక్షల బీమా కూడా నిలిపివేయనున్నారు. ఇతర మార్పులు మినిమం డ్యూయ్‌ పేమెంట్ కెలిక్యులేషన్, పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్‌లోనూ మార్పులు చేయనున్నారు.

Details

HDFC బ్యాంక్‌ నిబంధనల్లో మార్పులు 

జూలై 1, 2025 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు కొత్త ఛార్జీలు వర్తించనున్నాయి లావాదేవీల పరిమితులు : ఆన్‌లైన్ స్కిల్స్ గేమింగ్, వాలెట్ లోడింగ్, యుటిలిటీ బిల్లులకు నెలకు రూ. 50,000 (బిజినెస్ కార్డులకు రూ. 75,000) వరకు పరిమితి. చార్జీలు : ఈ లావాదేవీలపై నెలకు గరిష్ఠంగా 1% లేదా రూ. 4,999 చార్జీ. రివార్డ్ పాయింట్ల పరిమితి Infinia - 10,000 పాయింట్లు Diners Black - 5,000 పాయింట్లు ఇతర కార్డులు - 2,000 పాయింట్లు గమనిక : Marriott Bonvoy కార్డులకు ఈ పరిమితులు వర్తించవు. గేమింగ్ ఖర్చులకు రివార్డ్స్ ఉండవు

Details

 కోటక్‌ మైగ్రేషన్ అప్డేట్ 

జూలై 10, 2025 నుంచి కోటక్ మహీంద్రా బ్యాంక్‌ 'మింత్రా కోటక్ క్రెడిట్ కార్డ్‌'ను నిలిపివేస్తోంది. యూజర్లు కోటక్ లీగ్ క్రెడిట్ కార్డ్‌ కు మైగ్రేట్‌ అవ్వాల్సి ఉంటుంది. కొత్త కార్డ్ ఫీచర్లు, రివార్డ్ పాయింట్ల విధానం, షాపింగ్‌ ప్రయోజనాలపై స్పష్టత కావాలంటే బ్యాంక్ ఇచ్చే వివరాలను తప్పనిసరిగా చదవాలి. జూలై నుంచి అమల్లోకి వచ్చే ఈ మార్పులు ప్రతి క్రెడిట్ కార్డు వినియోగదారుడికి ప్రాముఖ్యమైనవే. ప్రయోజనాలను కోల్పోకుండా, అనవసర ఛార్జీలను నివారించేందుకు తమ కార్డుకు సంబంధించిన తాజా నిబంధనలను తెలుసుకుని, అందుకు తగ్గట్టుగా వినియోగాన్ని సర్దుబాటు చేసుకోవడం ఎంతో అవసరం.