Loading...
New RBI Rules: హోమ్ లోన్ రుణగ్రహీతలకు ఆర్బీఐ కొత్త నిబంధనలు.. ఈఎంఐలపై ప్రభావం
హోమ్ లోన్ రుణగ్రహీతలకు ఆర్బీఐ కొత్త నిబంధనలు.. ఈఎంఐలపై ప్రభావం

New RBI Rules: హోమ్ లోన్ రుణగ్రహీతలకు ఆర్బీఐ కొత్త నిబంధనలు.. ఈఎంఐలపై ప్రభావం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2026
09:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో గృహ రుణాలు,ఇతర రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రతిపాదనలు చేసింది. వడ్డీ రేట్లలో మార్పుల ప్రభావాన్ని రుణగ్రహీతలకు మరింత త్వరగా అందించే ఉద్దేశంతో కొత్త నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. అయితే,ఈ ప్రతిపాదనల కారణంగా ప్రస్తుతం మీ నెలవారీ ఈఎంఐలో వెంటనే ఎలాంటి మార్పు ఉండదు. ఇవి ఇంకా ముసాయిదా దశలోనే ఉన్నాయి.ఈ డ్రాఫ్ట్ నిబంధనలపై ప్రజలు,సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను 2026 సెప్టెంబర్ 11 వరకు తెలియజేయవచ్చు. ప్రతిపాదనలకు తుది ఆమోదం లభిస్తే..కొత్త నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

వివరాలు 

ప్రతి మూడు నెలలకు వడ్డీ రేటు సవరణ

అప్పుడు వడ్డీ రేట్లలో తగ్గింపు లేదా పెంపు జరిగినప్పుడు దాని ప్రభావం రుణగ్రహీతలపై ప్రస్తుతంతో పోలిస్తే వేగంగా పడుతుంది.

ప్రస్తుతం అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఫ్లోటింగ్ రేట్ రుణాలపై వడ్డీ రేట్లను ఏడాదికి ఒకసారి మాత్రమే సవరిస్తున్నాయి.

దీంతో ఆర్బీఐ రెపో రేటును తగ్గించినా.. ఆ ప్రయోజనం రుణగ్రహీతలకు చేరేందుకు కొన్ని నెలల సమయం పడుతోంది.

ఈ జాప్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఆర్బీఐ తాజా ప్రతిపాదనలు తీసుకొచ్చింది.

కొత్త విధానం అమల్లోకి వస్తే ఫ్లోటింగ్ రేట్ రుణాల వడ్డీ రేట్లను గరిష్ఠంగా మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా సవరించాల్సి ఉంటుంది.

అంటే.. రెపో రేటు తగ్గినప్పుడు దాని ప్రయోజనం రుణగ్రహీతలకు వేగంగా అందుతుంది.

వివరాలు 

ప్రతి మూడు నెలలకు వడ్డీ రేటు సవరణ

అదే సమయంలో రెపో రేటు పెరిగితే.. పెరిగిన వడ్డీ భారం కూడా అంతే త్వరగా రుణగ్రహీతలపై పడుతుంది.

ఛాయిస్ ఫిన్‌సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ విజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనల్లో ప్రధాన ప్రయోజనం వెంటనే వడ్డీ రేటు తగ్గడంలో కాకుండా, రేట్ల మార్పుల్లో సమయం, పారదర్శకత పెరగడంలో ఉందని తెలిపారు.

రెపో రేటు తగ్గింపు ప్రయోజనం ఇకపై నెలల తరబడి ఆలస్యం కాకుండా త్వరగా రుణగ్రహీతలకు చేరుతుందని చెప్పారు.

అలాగే రుణ ఒప్పందంలో ఏ బెంచ్‌మార్క్‌ను అనుసరిస్తున్నారు, వడ్డీ రేటును ఎంత తరచుగా సవరిస్తారు అనే అంశాలను స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుందని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

పాత, కొత్త రుణాలపై ప్రభావం ఎలా ఉంటుంది?

ఆర్బీఐ ప్రతిపాదించిన కొత్త విధానం కేవలం ఫ్లోటింగ్ రేట్ రుణాలకే వర్తిస్తుంది. పర్సనల్ లోన్లు, ఆటో లోన్లలో చాలా వరకు స్థిర వడ్డీ రేట్లు ఉంటాయి.

అందువల్ల ఈ ప్రతిపాదనల కారణంగా అలాంటి రుణాల ఈఎంఐలపై ఎలాంటి ప్రభావం ఉండదు.

ఇప్పటికే ఫ్లోటింగ్ రేట్‌పై రుణం తీసుకున్న వారు ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

పాత రుణాలను కొత్త విధానానికి మార్చుకునేందుకు 2029 ఏప్రిల్ 1 వరకు అవకాశం ఉంటుంది.

రుణగ్రహీత అంగీకారంతో ఈ మార్పును ఎలాంటి అదనపు రుసుము లేకుండా చేయాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

కొత్తగా రుణం తీసుకునేవారు ఏం గమనించాలి?

కొత్తగా గృహ రుణం తీసుకునే సమయంలో కేవలం తక్కువ వడ్డీ రేటు ఉందా లేదా అనే విషయాన్నే చూసి నిర్ణయం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

మొదటిది స్ప్రెడ్. బ్యాంకులు తమ బెంచ్‌మార్క్ రేటుకు అదనంగా వసూలు చేసే మార్జిన్‌ను స్ప్రెడ్ అంటారు.

సాధారణంగా రుణం మొత్తం కాలానికి ఇది స్థిరంగా ఉంటుంది. అందువల్ల తక్కువ స్ప్రెడ్‌ను అందించే బ్యాంకును ఎంచుకోవడం రుణగ్రహీతకు ప్రయోజనకరంగా ఉంటుంది.

వివరాలు 

కొత్తగా రుణం తీసుకునేవారు ఏం గమనించాలి?

రెండోది రీసెట్ ఫ్రీక్వెన్సీ. రుణంపై వడ్డీ రేటును ఎంత తరచుగా సవరిస్తారో ముందుగానే తెలుసుకోవాలి.

కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఈ అంశం మరింత కీలకంగా మారనుంది. మూడోది ఈఎంఐ హెడ్‌రూమ్.

భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగితే పెరిగిన ఈఎంఐ భారాన్ని తాము భరించగలమా లేదా అనే విషయాన్ని రుణం తీసుకునే ముందే అంచనా వేసుకోవాలి.

ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 5.25 శాతం వద్ద కొనసాగుతోంది. భవిష్యత్తులో రెపో రేటులో మార్పులు చోటుచేసుకుంటే.. వాటి ప్రభావం కొత్త నిబంధనల కారణంగా ఫ్లోటింగ్ రేట్ రుణాలపై మరింత వేగంగా కనిపించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ADVERTISEMENT