
UPI: నవంబర్ 3 నుంచి యూపీఐలో నూతన నియమాలు.. మీ లావాదేవీలపై ప్రభావం ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో రోజూ కోట్లాది మంది ప్రజలు డబ్బు లావాదేవీల కోసం యూపీఐ (Unified Payment Interface) యాప్‌లను వాడుతున్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేందుకు, భద్రతా ప్రమాణాలను పెంచేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తరచూ కొత్త మార్పులను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో నవంబర్ 3, 2025 నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి
Details
యూపీఐలో రాబోయే మార్పులు
నవంబర్ 3 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త రూల్స్ వల్ల కస్టమర్ వ్యాపార లావాదేవీలు మరింత వేగంగా, పారదర్శకంగా, సురక్షితంగా జరుగుతాయని NPCI తెలిపింది. ముఖ్యంగా సెటిల్‌మెంట్ సైకిల్స్‌లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త సెటిల్‌మెంట్ సైకిల్స్ కొత్త నిబంధనల ప్రకారం ఆమోదించిన లావాదేవీలు రోజుకు 10 వేర్వేరు పేమెంట్ సైకిల్స్‌లో ప్రాసెస్ అవుతాయి. అదనంగా వివాదాస్పద లావాదేవీల కోసం ప్రత్యేకంగా రెండు కొత్త సైకిల్స్‌ను కూడా ప్రవేశపెట్టారు.
Details
రోజుకు పది పేమెంట్ సైకిల్స్ (లావాదేవీల ప్రాసెసింగ్ సమయాలు)
1. సైకిల్ 1: రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి వరకు 2. సైకిల్ 2: అర్ధరాత్రి నుండి ఉదయం 5 గంటల వరకు 3. సైకిల్ 3: ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు 4. సైకిల్ 4: ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 5. సైకిల్ 5: ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు 6. సైకిల్ 6: ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు
Details
7. సైకిల్ 7: మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు
8. సైకిల్ 8: మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు 9. సైకిల్ 9: సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు 10. సైకిల్ 10: సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు