Page Loader
నిఫ్టీ బ్యాంక్​ ఎఫ్​ అండ్​ ఓ కాంట్రాక్టు ఎక్స్​పైరీ డేగా శుక్రవారం 
నిఫ్టీ బ్యాంక్​ ఎఫ్​ అండ్​ ఓ కాంట్రాక్టు ఎక్స్​పైరీ డేగా శుక్రవారం

నిఫ్టీ బ్యాంక్​ ఎఫ్​ అండ్​ ఓ కాంట్రాక్టు ఎక్స్​పైరీ డేగా శుక్రవారం 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 06, 2023
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

నిఫ్టీ బ్యాంక్​ ఫ్యూచర్​ అండ్​ ఆప్షన్స్ కాంట్రాక్టు​​ కాలపరిమితిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.​ గురువారానికి బదులుగా శుక్రవారానికి మారింది. ఈ మేరకు మార్పులు చేస్తూ NSE ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతానికి నిఫ్టీ బ్యాంక్​ వీక్లీ కాంట్రాక్ట్స్​ నెలవారీ, త్రైమాసిక కాంట్రాక్ట్స్​ సంబంధిత నెల చివరి గురువారం ఎక్స్​పైర్​ అవుతున్నాయి. ఈ ఎక్స్​పైరీని ఇక నుంచి శుక్రవారానికి మార్చేస్తున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ నూతన నియమ నిబంధనలు​ జులై 7 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేస్తూ సర్క్యులర్​ను జారీ చేసింది. అయితే టెక్నికల్ గా తొలి ఫ్రైడే ఎక్స్​పైరీ మాత్రం జులై 14నే జరుగుతుందని NSE​ వెల్లడించింది.

Nifty Bank F And O Expiry On Friday Rather Thursday 

జులై 14నే తొలి ఫ్రైడే ఎక్స్​పైరీ 

ఏదైనా కారణం వల్ల ఫ్రైడే హాలిడేగా వస్తే, ముందు ట్రేడింగ్​ సెషన్​లోనే ఎక్స్​పైరీ ఉంటుందని వివరించింది. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టుల ఎక్స్​పైరీ జులై 13 గురువారం కనుక, జులై 14న ఫ్రైడే ఎక్స్​పైరీ అవుతుంది. గత నిబంధనల ప్రకారం 2023 ఆగస్టులో బ్యాంక్​ నిఫ్టీ ఎఫ్​ అండ్​ ఓ ఎక్స్​పైరీ ఆ నెల 31న జరగాల్సి ఉంది. తాజా రూల్స్​ ప్రకారం ఆగస్టు 25న జరుగుతుందని సంస్థ వివరించింది. NSEకి పోటీగా మేలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సైతం కాంట్రాక్ట్స్​లను మొదలుపెట్టింది. స్టాక్​ మార్కెట్​లో ఓక్కో షేరు ప్రత్యేకంగా కొనొచ్చు. ఎఫ్​ అండ్​ ఓలో అలా ఉండదు. ఇందులో లాట్స్ అని ఉంటాయి. ఒక్కో లాట్స్​ 100కుపైగా షేర్లను కలిగి ఉండటం గమనార్హం.