LOADING...
Stock market : వరుసగా రెండో రోజూ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
వరుసగా రెండో రోజూ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock market : వరుసగా రెండో రోజూ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టంలో ముగిశాయి. గరిష్ఠ స్థాయిలను చేరుకున్న తర్వాత మదుపర్లు లాభాలను స్వీకరించడంతో వరుసగా రెండో రోజు కూడా నష్టాలు నమోదయ్యాయి. రూపాయి విలువ బలహీనపడటం, అలాగే విదేశీ మదుపర్ల అమ్మకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. ఇంట్రాడేలో డాలరుతో రూపాయి మారకం విలువ 90కి చేరి రికార్డ్ కనిష్ఠ స్థాయిని తాకింది. రేపటి నుండి ప్రారంభమయ్యే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ భేటీపై మదుపర్లు దృష్టి సారించనున్నట్లు అనలిస్టులు భావిస్తున్నారు. RBI డిసెంబర్ 5న తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.

వివరాలు 

డాలరుతో రూపాయి మారకం విలువ 89.91గా నమోదు 

సెన్సెక్స్ ఉదయం 85,325.51 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 85,641.90) నష్టంతో ప్రారంభమయ్యింది. రోజంతా నష్టాల ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 85,053 నుంచి 85,553 పాయింట్ల మధ్య కదలాడిన సెన్సెక్స్, చివరికి 503 పాయింట్ల నష్టంతో 85,138.27 వద్ద ముగిసింది. నిఫ్టీ 143.55 పాయింట్ల తగ్గింపుతో 26,032 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 89.91గా నమోదైంది.

వివరాలు 

సెన్సెక్స్‌ 30  

సెన్సెక్స్ 30లో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బిఈఎల్ షేర్లు ప్రధానంగా నష్టపడ్డాయి. కాగా, ఏషియన్ పెయింట్స్, మారుతీ సుజుకీ, భారత్‌ఐ ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభంలో నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బారెల్ ధర 63.11 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 4,186 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement