Nita Ambani:'విక్షిత్ భారత్' కోసం నీతా అంబానీ బ్లూప్రింట్.. రిలయన్స్ ఫౌండేషన్ నుండి 25 కోట్ల మంది పాఠశాల పిల్లలకు సహాయం
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్,47వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేష్ అంబానీ ప్రసంగం తరువాత, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ తన సందేశాన్ని అందించారు. ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశం భారత్ అని, ఈ యువ శక్తి దేశాన్ని వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆమె అన్నారు. ఈ యువతకు సాధికారత కల్పించడమే దేశ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. చరిత్రను గౌరవిస్తూ, వర్తమానాన్ని పరిరక్షిస్తూ, భవిష్యత్తును తీర్చిదిద్దడం ద్వారా అభివృద్ధి చెందిన భారత్ కల నెరవేరుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
25 కోట్ల మంది పాఠశాల పిల్లలకు సహాయం
విద్యార్థులకు సహాయం చేయడం కోసం రిలయన్స్ ఫౌండేషన్ కీలకంగా పనిచేస్తోందని నీతా అంబానీ తెలిపారు. దేశంలోని సుమారు 25 కోట్ల పాఠశాల పిల్లలకు సహాయపడతామని ఆమె ప్రకటించారు. గత ఏడాది ప్రారంభమైన స్వదేశ్ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, ఇది భారత సంస్కృతి, మేక్ ఇన్ ఇండియా ప్రోత్సాహకానికి కీలకమైనదని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ కలను సాకారం చేసే దిశలో స్వదేశ్ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.