Reliance-Disney Merger: రిలయన్స్- డిస్నీ విలీనానికి ముందు వయాకామ్ బోర్డులోకి నీతా,ఆకాష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన ముకేష్ అంబానీ, వాల్ట్ డిస్నీకి సంబంధించిన మీడియా వ్యాపారాల విలీనంలో మరొక కీలక దశలో ప్రవేశించారు. ఈ క్రమంలో, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ వయాకామ్ 18 బోర్డులో చేరారని సమాచారం. వయాకామ్ 18 అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్, బోధి ట్రీ సిస్టమ్స్‌కి చెందిన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగం. ఈ ప్రతిపాదిత విలీనం ఇప్పటికే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI)నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) నైతిక ముద్రను పొందింది. CCI సూచనల ప్రకారం,వ్యాపారంలో చిన్న మార్పులు మినహాయించి, విలీనం ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా తల్లీ, కుమారులు బోర్డులో చేరడం ప్రత్యేకంగా గమనార్హం.
రూ.70,000 కోట్ల విలువతో దేశంలోనే అతిపెద్ద మీడియా
వీరి తో పాటు, బోధి ట్రీ సిస్టమ్స్ కో ప్రమోటర్ జేమ్స్ ముర్దోచ్, కతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీకి చెందిన మహ్మద్ అహ్మద్ అల్ హర్దన్,రిలయన్స్‌లో మీడియా,కంటెంట్ వ్యాపార విభాగం ప్రెసిడెంట్ జ్యోతి దేశ్ పాండే,శువా మొండల్ వంటి అనేకులు వయాకామ్ 18 బోర్డులో నియమితులయ్యారు. విలీనం అనంతరం ఏర్పడే కొత్త సంస్థలో 120టీవీ ఛానళ్లు,రెండు స్ట్రీమింగ్ సేవలు ఉంటాయి. విలీనం అయిన సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్,అనుబంధ సంస్థలకు 63.16%వాటా ఉంటుంది. మిగతా 36.84%వాటా వాల్ట్ డిస్నీకి చెందుతుంది. సంయుక్త సంస్థకు నీతా అంబానీ నేతృత్వం వహిస్తారు.కాగా డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉండనున్నారు. ఈ విలీనం ద్వారా రూ.70,000 కోట్ల విలువతో దేశంలోనే అతిపెద్ద మీడియా సామ్రాజ్యం ఏర్పడనుంది.