LOADING...
LIC Premium from PF account: పీఎఫ్‌ ఖాతా నుంచే బీమా ప్రీమియం చెల్లింపు.. ఈపీఎఫ్‌ఓ కొత్త ఆప్షన్
పీఎఫ్‌ ఖాతా నుంచే బీమా ప్రీమియం చెల్లింపు.. ఈపీఎఫ్‌ఓ కొత్త ఆప్షన్

LIC Premium from PF account: పీఎఫ్‌ ఖాతా నుంచే బీమా ప్రీమియం చెల్లింపు.. ఈపీఎఫ్‌ఓ కొత్త ఆప్షన్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీవిత ప్రయాణంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా బీమా విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అనుకోని ప్రమాదం లేదా అపద ఎదురైనప్పుడు కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించేది బీమానే. అందువల్ల బీమా ప్రీమియంలను సమయానికి చెల్లించడం ఎంతో అవసరం. అయితే, కొన్ని సందర్భాల్లో ఆ ప్రీమియంలు చెల్లించడానికి కూడా ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. అలాంటి వేళల్లో పీఎఫ్‌ ఖాతా నుంచి ప్రీమియం చెల్లించే సౌకర్యాన్ని ఈపీఎఫ్‌ఓ అందిస్తోంది. తాత్కాలిక ఆర్థిక కష్టాల కారణంగా జీవిత బీమా పాలసీ ల్యాప్స్‌ కాకుండా ఉండేందుకు ఈ వెసులుబాటు ఉపయోగకరంగా ఉంటుంది.

వివరాలు 

 ఖాతాదారుడి పేరుమీదే ప్రీమియం చెల్లించే పాలసీ

ఈపీఎఫ్‌ పథకం నిబంధనల ప్రకారం..కొత్త జీవిత బీమా పాలసీ తీసుకోవడానికి లేదా ఇప్పటికే ఉన్న పాలసీకి ప్రీమియం చెల్లించడానికి పీఎఫ్‌ ఖాతాలోని నిల్వలను వినియోగించుకోవచ్చు. యాక్టివ్‌లో ఉన్న పీఎఫ్‌ అకౌంట్‌ కలిగినవారికి ఈ అవకాశం ఉంటుంది.అయితే,కనీసం రెండు నెలల జీతానికి సమానమైన మొత్తం పీఎఫ్‌ ఖాతాలో ఉండాలి. ప్రీమియం చెల్లించే పాలసీ తప్పనిసరిగా ఖాతాదారుడి పేరుమీదే ఉండాలి.జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరుపై ఉన్న పాలసీలకు ఈ సౌకర్యం వర్తించదు. అలాగే, ఇది కేవలం వార్షిక ప్రీమియంల చెల్లింపులకు మాత్రమే పరిమితం. ప్రైవేటు బీమా కంపెనీల పాలసీల ప్రీమియంలకు ఈ ఆప్షన్‌ను ఉపయోగించుకునే అవకాశం లేదు. ఈ సదుపాయాన్ని పొందాలంటే ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఫారం-14ను డౌన్‌లోడ్‌ చేసి సమర్పించాల్సి ఉంటుంది.

వివరాలు 

బయట రుణం తీసుకోవాల్సిన అవసరం ఉండదు

ముందుగా యూఏఎన్‌,పాస్‌వర్డ్‌తో ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో లాగిన్‌ కావాలి. అనంతరం కేవైసీ సెక్షన్‌లోకి వెళ్లి అక్కడ ఉన్న ఎల్‌ఐసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. పాలసీ నంబర్‌తో పాటు అవసరమైన ఇతర వివరాలను నమోదు చేయాలి.ఒకసారి పాలసీ వివరాలు లింక్‌ అయిన తర్వాత.. నిర్ణీత తేదీన ప్రీమియం మొత్తం ఆటోమేటిక్‌గా పీఎఫ్‌ ఖాతా నుంచి డెబిట్‌ అవుతుంది. దీంతో ప్రీమియం గడువు మిస్‌ కావడం వల్ల పాలసీ నిలిచిపోవడాన్ని నివారించవచ్చు. అలాగే, ప్రీమియం చెల్లించేందుకు బయట రుణం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే, రిటైర్మెంట్‌ తర్వాత భద్రత కోసం ఉద్దేశించిన పీఎఫ్‌ సేవింగ్స్‌ తగ్గిపోవచ్చనే అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అత్యవసర ఆర్థిక పరిస్థితుల్లో మాత్రమే ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

Advertisement