IndusInd Bank: ఇండస్‌ఇండ్ బ్యాంక్‌పై ఆందోళన అవసరం లేదు.. స్థిరంగా ఆర్థిక పరిస్థితి : ఆర్‌బీఐ
ఈ వార్తాకథనం ఏంటి
ఇండస్‌ఇండ్ బ్యాంక్ (IndusInd Bank) ఆర్థిక స్థితి స్థిరంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది.
ఇటీవల బ్యాంక్‌పై వస్తున్న ఊహాజనిత వార్తల గురించి డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్ బి ఐ సూచించింది.
అయితే బ్యాంక్‌కు చెందిన డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించడంతో, బ్యాంకింగ్ షేర్లు స్టాక్ మార్కెట్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
Details
రూ.2,100 కోట్ల అకౌంటింగ్ తేడాలు.. ఆర్‌బీఐ దర్యాప్తు
ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో దాదాపు రూ.2,100 కోట్ల అకౌంటింగ్ తేడాలు వెలుగులోకి రావడంతో, రిజర్వ్ బ్యాంక్ ఇతర బ్యాంకుల లావాదేవీలను కూడా సమీక్షిస్తోంది.
కరెన్సీ డెరివేటివ్స్‌కు సంబంధించిన ఈ అవకతవకలను గతేడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో గుర్తించినా బ్యాంక్ తాజాగా బహిర్గతం చేసింది.
ఈ పరిణామం కారణంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేరు భారీగా పతనమైంది.
చిన్న మదుపర్లు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి.
Details
రూ.1,600 కోట్ల నష్టం సంభవించే అవకాశం
విశ్లేషకుల అంచనాల ప్రకారం, ఈ అకౌంటింగ్ లోపాల కారణంగా మార్చి త్రైమాసికంలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ రూ.1,600 కోట్ల నష్టాన్ని చవిచూడొచ్చు.
దీంతో ప్రస్తుత త్రైమాసికంలోనే పరిష్కార చర్యలను పూర్తి చేయాలని ఇండస్‌ఇండ్ బ్యాంక్ బోర్డుకు ఆర్‌బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో బ్యాంక్ పునరుద్ధరణ చర్యలపై మార్కెట్ నిశితంగా గమనిస్తోంది.