Nvidia Board Decision: ఎన్విడియాలో జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి నో.. మళ్లీ సీఈవోగా తీసుకోమన్న బోర్డు!
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్విడియా (Nvidia) సీఈవోగా తిరిగి బాధ్యతలు చేపట్టాలన్న జెన్సెన్ హువాంగ్ (Jensen Huang) ఆశలకు గండిపడింది. ఆయన తిరిగి రావాలన్న కోరికను వ్యక్తం చేసిన కొద్దిసేపటికే కంపెనీ ఛైర్మన్ హార్వీ జోన్స్ కీలక ప్రకటన చేశారు. జెన్సన్ హువాంగ్‌ది ముగిసిన అధ్యాయమని స్పష్టం చేశారు. ఇప్పటికే కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఆయన రాజీనామాను ఏకగ్రీవంగా ఆమోదించిందని వెల్లడించారు. కొత్త వ్యక్తిని సీఈవోగా నియమించే వరకు కొలెట్ క్రెస్ తాత్కాలిక సీఈవోగా కొనసాగుతారని తెలిపారు. బోర్డు ఆయన రాజీనామాను ఆమోదించింది. జెన్సన్‌ను తిరిగి నియమించే ఉద్దేశం మాకు లేదని హార్వీ జోన్స్ ప్రకటించారు.
వివరాలు
తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమన్న జెన్సన్
అంతకుముందు జెన్సన్ హువాంగ్ సామాజిక మాధ్యమ వేదికగా తన మనసులోని మాటను వెల్లడించారు.
వాటాదారులు, ఉద్యోగులు, సంస్థ, అమెరికా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని.. నేను తిరిగి రావడమే ఉత్తమమని డైరెక్టర్ల బోర్డు నిర్ణయిస్తే సీఈవో బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
తన వ్యక్తిగత జీవితంలో తీవ్రమైన తప్పిదాలు చేశానని కూడా అంగీకరించారు.
తిరిగి తాను బాధ్యతలు చేపట్టాలని సంస్థ ఉద్యోగులు, పెట్టుబడిదారులు, వ్యాపార భాగస్వాములు, వినియోగదారులు పెద్ద ఎత్తున కోరుతున్నారని గుర్తు చేశారు.
వివరాలు
జెన్సన్‌కు మద్దతుగా 1.9 లక్షల మంది లేఖ
జెన్సన్ హువాంగ్‌కు మద్దతుగా దాదాపు 1.9 లక్షల మంది ఉద్యోగులు, సిలికాన్ వ్యాలీ ప్రముఖులు ఆన్‌లైన్‌లో లేఖ రాశారు.
ఆయనను తిరిగి సీఈవోగా నియమించాలని కోరారు. అయితే ఈ మద్దతు, విజ్ఞప్తులను కంపెనీ బోర్డు పరిగణనలోకి తీసుకోలేదు.
జెన్సన్ పునరాగమనానికి అవకాశం లేదని స్పష్టం చేస్తూ కొత్త సీఈవో నియామకంపై దృష్టి సారించింది.
వివరాలు
భారీగా పెరిగిన ఎన్విడియా ఆదాయం
మరోవైపు ఎన్విడియా మంగళవారం తన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జెన్సన్ హువాంగ్ లేకుండా కంపెనీ ప్రకటించిన తొలి ఫలితాలు ఇవే కావడం గమనార్హం.
కంపెనీ ఛైర్మన్ హార్వీ జోన్స్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను మించి ఎన్విడియా 115.84 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించినట్లు తెలిపారు.
గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం రెట్టింపైనట్లు పేర్కొన్నారు.