Noel Tata: టాటా ట్రస్ట్ తదుపరి చైర్మన్ గా నోయల్ టాటా.. అయన ఎవరంటే..?
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణానంతరం టాటా ట్రస్ట్ నాయకత్వంపై చర్చలు ముమ్మరంగా సాగాయి. ఈ పాత్ర కోసం నోయెల్ టాటా పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నారు. గ్రూప్ హోల్డింగ్ కంపెనీల ట్రస్టుల నిర్వహణలో నోయెల్ కీలక వ్యక్తిగా ఎదిగారు. ఇటీవలి సంవత్సరాలలో, అయన టాటా ట్రస్ట్‌లలో ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించాడు. ప్రస్తుతం సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు ట్రస్టీగా ఉన్నారు.
నవల టాటా ఎవరు?
నోయెల్ నావల్ టాటా, సైమన్ టాటాల కుమారుడు, రతన్ టాటా, సవతి సోదరుడు. అయన 1957 లో జన్మించాడు. అయన ససెక్స్ విశ్వవిద్యాలయం నుండి తన డిగ్రీని అందుకున్నాడు. INSEADలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (IEP)ని కూడా పూర్తి చేశాడు. అయన ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ చైర్మన్ పదవులతో సహా పలు టాటా గ్రూప్ కంపెనీల బోర్డులలో కీలక పదవులను కలిగి ఉన్నాడు.
ఇదే అయన కెరీర్
నోయెల్ ప్రస్తుతం టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఛైర్మన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. దీనికి ముందు, అయన ట్రెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. కంపెనీ విస్తరణకు గణనీయమైన కృషి చేశాడు. అయన టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా ఎన్నికైతే, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11వ ఛైర్మన్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరవ ఛైర్మన్‌గా ఉంటారు. అయన నాయకత్వంలో, ట్రస్ట్‌లు అభివృద్ధి చెందుతాయని, వారి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.