
Rapido: రాపిడో యాప్‌లో విమాన, బస్సు, రైలు టికెట్ బుకింగ్ సౌకర్యం
ఈ వార్తాకథనం ఏంటి
రైడ్‌షేరింగ్ సంస్థ రాపిడో తన సేవలను క్రమంగా విస్తరిస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ, ఇప్పుడు మరింత ముందుకెళ్లి తన యాప్‌లోనే విమాన, బస్సు, రైలు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్‌ను బుధవారం అధికారికంగా ప్రారంభించింది.దీనికోసం ర్యాపిడో, గోఐబీబో, రెడ్‌బస్, కన్ఫర్మ్ టికెట్ వంటి ప్రముఖ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లతో భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యంతో యూజర్లు ర్యాపిడో యాప్ ద్వారానే హోటల్ బుకింగ్‌లు, విమానాలు, నగరాల మధ్య బస్సు సర్వీసులు, రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం పొందుతున్నారు.
వివరాలు
కొన్ని క్లిక్‌లతోనే అన్ని బుకింగ్‌లు పూర్తి చేసే వీలు
ఈ సదుపాయం ద్వారా వినియోగదారులు చాలా తక్కువ సమయంలోనే విమానాశ్రయానికి వెళ్లే టికెట్లు బుక్ చేసుకోవచ్చని,అలాగే సెలవుల కోసం ముందుగానే ట్రావెల్ ప్లాన్ చేయడమో,అవసరమైనప్పుడు వెంటనే ప్రయాణం బుక్ చేయడమో సులభమవుతుందని తెలిపింది. కొన్ని క్లిక్‌లతోనే అన్ని బుకింగ్‌లు పూర్తి చేసే వీలు కల్పించిందని వివరించింది. ర్యాపిడో యాప్‌లోని హోమ్ స్క్రీన్‌లో'ట్రావెల్'ఆప్షన్ ను ఎంచుకోవడం ద్వారా యూజర్లు విమాన టికెట్లు,హోటళ్లు,బస్సులు,రైలు టికెట్లు సులభంగా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 కోట్లకుపైగా నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్న ర్యాపిడో,డెలివరీ సేవల్లో కనెక్టివిటీ లోపాలను తగ్గిస్తూ,మరింత వేగవంతమైన సేవలను అందిస్తోంది. ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ,రోజువారీ రవాణాలో భాగమయ్యే లక్షలాది మందికి సౌకర్యవంతమైన, నమ్మకమైన సేవలను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని ర్యాపిడో తెలిపింది.