Medicines Prices:సామాన్యులకు షాకింగ్.. పెరగనున్న 54 రకాల మందుల ధరలు
నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) 54 ఔషధ సూత్రీకరణలు, ఎనిమిది ప్రత్యేక ఫీచర్ ఉత్పత్తుల రిటైల్ ధరలను నిర్ణయించినట్లు ప్రకటించింది. అథారిటీ 124వ సమావేశంలో సూత్రీకరణల ధరలను సవరించాలని నిర్ణయం తీసుకున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్,NPPA నుండి నోటిఫికేషన్ ప్రకారం మధుమేహం,రక్తపోటు,గుండె సమస్యలు,మల్టీవిటమిన్‌లు,బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు,అలర్జీలకు సంబంధించిన మందులు, ఫార్ములేషన్‌లకు ధరలు నిర్ణయించబడ్డాయి. రక్తపోటు కోసం టెల్మిసార్టన్, క్లోర్తాలిడోన్, సిల్నిడిపైన్ కలిపిన మాత్రల రిటైల్ ధర ఒక్కో టాబ్లెట్‌కు రూ.7.14గా నిర్ణయించగా,సిప్రోఫ్లోక్సాసిన్ యాంటీ బాక్టీరియల్ ఇంజక్షన్ ధర మిల్లీలీటర్,కు రూ.0.23గా నిర్ణయించారు. అదే విధంగా క్యాల్షియం,విటమిన్ డి3 ట్యాబ్లెట్ల ధరను ఒక్కో టాబ్లెట్‌కు రూ.7.82గా నిర్ణయించగా, యూరో హెడ్ ప్లాస్టిక్ బాటిళ్లతో కూడిన 500 ఎంఎల్ గ్లూకోజ్ ప్యాక్ ధర రూ.0.24గా నిర్ణయించారు.
మే 2024లో 41 ఔషధాలపై తగ్గింపు
రిటైల్, సీలింగ్ ధరల సవరణ,స్థిరీకరణ అనేది NPPAచే నిర్వహించే ఒక సాధారణ ప్రక్రియ. ఔషధ ఉత్పత్తుల ధరలను నిర్ణయించడం, సవరించడం, డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్(DPCO) నిబంధనలను అమలు చేయడం,నియంత్రిత,నియంత్రణ లేని ఔషధాల ధరలను పర్యవేక్షించడం వంటి బాధ్యత ఔషధ ధరల నియంత్రణ సంస్థకు ఉంది. టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ)లో మార్పుల ఆధారంగా నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (ఎన్‌ఎల్‌ఈఎం)లో చేర్చబడిన ఔషధాల ధరలను 0.00551శాతం పెంచుతున్నట్లు ఈఏడాది మార్చిలో ఎన్‌పిపిఎ ప్రకటించిన తర్వాత రిటైల్ ధరలలో సవరణ జరిగింది. మే 2024లో 41 అవసరమైన ఔషధాలపై ఔషధ ధరల నియంత్రణ సంస్థ రిటైల్ ధరలలో ఇదే విధమైన తగ్గింపును ప్రకటించింది.అలాగే ఏడు షెడ్యూల్డ్ ఫార్ములేషన్ల సీలింగ్ రేట్లను సవరించింది.