Loading...
NSE Market Capitalisation: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఎక్స్ఛేంజీగా ఎన్‌ఎస్‌ఈ.. మార్కెట్‌ విలువ రూ.5.49 లక్షల కోట్లు
ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఎక్స్ఛేంజీగా ఎన్‌ఎస్‌ఈ.. మార్కెట్‌ విలువ రూ.5.49 లక్షల కోట్లు

NSE Market Capitalisation: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఎక్స్ఛేంజీగా ఎన్‌ఎస్‌ఈ.. మార్కెట్‌ విలువ రూ.5.49 లక్షల కోట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 21, 2026
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

మార్కెట్‌ విలువ పరంగా నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ) ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఎక్స్ఛేంజీగా అవతరించింది. ఎన్‌ఎస్‌ఈ మార్కెట్‌ విలువ 58.5 బిలియన్‌ డాలర్లకు (రూ.5.49 లక్షల కోట్లు) చేరడం ఇందుకు కారణం. ఈ క్రమంలో హాంకాంగ్‌ ఎక్స్ఛేంజెస్‌ అండ్‌ క్లియరింగ్‌ (హెచ్‌కేఈఎక్స్‌), అమెరికాకు చెందిన నాస్‌డాక్‌ను ఎన్‌ఎస్‌ఈ వెనక్కి నెట్టింది.

వివరాలు

ఈ నెలలో 25 శాతం పెరిగిన షేరు

ఈ ఏడాది సెప్టెంబరు చివరి వారంలో ఎన్‌ఎస్‌ఈ షేరు స్టాక్‌ మార్కెట్‌లో నమోదైంది. లిస్టింగ్‌ తర్వాత ఈ షేరు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంది.

అయినప్పటికీ ఈ నెలలో 25 శాతం దూసుకెళ్లి రూ.2,251 వద్ద రికార్డు గరిష్ఠాన్ని తాకింది. శుక్రవారం ట్రేడింగ్‌లో ఈ షేరు రూ.2,220 వద్ద కొనసాగింది.

వివరాలు

దేశంలోని టాప్‌-10 కంపెనీల్లోనూ స్థానం

మార్కెట్‌ విలువ పరంగా దేశంలోని అత్యంత విలువైన టాప్‌-10 కంపెనీల జాబితాలోనూ ఎన్‌ఎస్‌ఈ చోటు దక్కించుకుంది.

ఎల్‌ఐసీ (రూ.5.18 లక్షల కోట్లు), కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (రూ.5.13 లక్షల కోట్లు)లను వెనక్కి నెట్టి పదో స్థానానికి చేరింది.

బ్యాంకింగ్‌, ఐటీ, చమురు-గ్యాస్‌ రంగాల్లోని అగ్రగామి కంపెనీల సరసన క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విభాగం నుంచి ఈ స్థాయికి చేరిన తొలి భారతీయ ఎక్స్ఛేంజీగా ఎన్‌ఎస్‌ఈ చరిత్ర సృష్టించింది.

ADVERTISEMENT