Nvidia CEO: ఎన్విడియా సీఈఓ విడాకుల వ్యవహారం.. భార్యకు రూ.6.5 లక్షల కోట్ల భరణం?
ఈ వార్తాకథనం ఏంటి
నివిడియా (Nvidia) సంస్థ సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన వివాహేతర సంబంధం గురించి అంగీకరించిన నేపథ్యంలో,భార్య లోరీ హువాంగ్ విడాకులు తీసుకుంటే ఆయన సంపదలో సగం పొందే అవకాశం ఉందంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఫోర్బ్స్ అంచనా ప్రకారం జెన్సన్ హువాంగ్ మొత్తం సంపద 155.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.13 లక్షల కోట్లు). కాలిఫోర్నియా చట్టాల ప్రకారం విడాకులు తీసుకుంటే ఈ సంపదలో సగం అంటే దాదాపు 77 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6.5 లక్షల కోట్లు) లోరీకి దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య ముందస్తు వివాహ ఒప్పందం (prenuptial agreement) ఉందా? లేదా? అన్నది స్పష్టంగా తెలియదు.
వివరాలు
ఆరోపణలపై కంపెనీ విచారణ
మరోవైపు ఆలిస్ హువాంగ్ అనే మహిళకు చైనా గూఢచర్య సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఆరోపణలపై కంపెనీ విచారణ జరుపుతున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు.
భద్రతా సంస్థలకు సమర్పించిన పత్రాల ప్రకారం జెన్సన్ హువాంగ్ సుమారు 60 కోట్ల ఎన్విడియా షేర్లను పలు కుటుంబ ట్రస్టులు,పరిమిత బాధ్యత సంస్థలకు (ఎల్‌ఎల్‌సీ)బదిలీ చేశారు.
మరో 7 కోట్ల షేర్లపై ఆయనకు నేరుగా నియంత్రణ ఉంది. ఎన్విడియాలో ఆయనకు 3.4 శాతం వాటా ఉన్నట్లు సమాచారం.
లోరీ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటే సుమారు 33.5 కోట్ల షేర్లకు సమానమైన వాటా పొందే అవకాశం ఉందని, వాటి విలువ దాదాపు 60 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.
వివరాలు
కాలిఫోర్నియా చట్టాల ప్రకారం ఆస్తుల విభజన
ఎన్విడియా 2026 ప్రాక్సీ నివేదిక ప్రకారం జెన్సన్ పేరు మీద ఉన్న కొన్ని షేర్లు ట్రస్టుల పరిధిలో ఉన్నాయి.
వీటికి భార్యాభర్తలిద్దరూ సహ ధర్మకర్తలుగా (కో-ట్రస్టీలు)వ్యవహరిస్తున్నారు.
ఆ షేర్లపై ఇద్దరికీ ఉమ్మడి ప్రయోజన హక్కులు ఉన్నట్లు పరిగణించే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భార్యాభర్తలు వివాహం తర్వాత సంపాదించిన ఆస్తులపై ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి.
దీన్నే 'కమ్యూనిటీ ప్రాపర్టీ' చట్టం అంటారు. జెన్సన్ హువాంగ్ వద్ద ఉన్నట్లు తెలిసిన 67 కోట్ల షేర్లతో పాటు మరో 14 కోట్ల షేర్లు రెండు రద్దు చేయలేని ట్రస్టుల్లో ఉన్నట్లు సమాచారం.
అయితే ఆ ట్రస్టులకు సంబంధించిన నిబంధనల ఆధారంగా వాటిపై హక్కులు పొందడం అంత సులభం కాకపోవచ్చని తెలుస్తోంది.
వివరాలు
కాలిఫోర్నియా చట్టాల ప్రకారం ఆస్తుల విభజన
జెన్సన్, లోరీ హువాంగ్ 1985లో వివాహం చేసుకున్నారు. 1993లో జెన్సన్ ఎన్విడియా సంస్థను స్థాపించడానికి ఎనిమిదేళ్ల ముందే వీరి పెళ్లి జరిగింది.
దీంతో ఎన్విడియా ద్వారా ఆయన సంపాదించిన సంపదలో ఎక్కువ భాగం వివాహం తర్వాత వచ్చిన ఆస్తిగానే పరిగణించే అవకాశం ఉంది.
కాలిఫోర్నియా చట్టాల ప్రకారం విడాకులు తీసుకుంటే అలాంటి ఆస్తులను సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది.
ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ ప్రస్తుతం ఎన్విడియాలోనే పనిచేస్తున్నారు.
వివరాలు
ఫోర్బ్స్ అంచనా ప్రకారం జెన్సన్ సంపద ఎంతంటే?
కూకాయిన్ నివేదిక ప్రకారం ఈ దంపతులకు లాస్ ఆల్టోస్ హిల్స్, మౌయి, శాన్‌ఫ్రాన్సిస్కోలోని గోల్డ్ కోస్ట్ ప్రాంతాల్లో మూడు విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి.
వీటి విలువ 70 మిలియన్ డాలర్ల నుంచి 95 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా.
ఫోర్బ్స్ లెక్కల ప్రకారం జెన్సన్ హువాంగ్ సంపద 155.2 బిలియన్ డాలర్లు. విడాకుల పరిష్కారంలో లోరీకి ఎంత మొత్తం దక్కుతుందనే దానిపై స్పష్టత లేకపోయినా, సుమారు 77 బిలియన్ డాలర్లు రావచ్చని అంచనా వేస్తున్నారు.
అదే జరిగితే ప్రపంచంలోనే అత్యధిక విలువ కలిగిన విడాకుల పరిష్కారాల్లో ఇది ఒకటిగా నిలవనుంది.
వివరాలు
ఫోర్బ్స్ అంచనా ప్రకారం జెన్సన్ సంపద ఎంతంటే?
గతంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నుంచి విడాకులు తీసుకున్న మెకెంజీ స్కాట్‌కు కంపెనీ షేర్ల రూపంలో 36 బిలియన్ డాలర్లు దక్కాయి.
అలాగే బిల్ గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న మెలిండా గేట్స్‌కు సుమారు 70 బిలియన్ డాలర్లు అందినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆ ఒప్పందానికి సంబంధించిన కచ్చితమైన మొత్తం వెల్లడికాలేదు.
2024 మేలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహ అధ్యక్షురాలి బాధ్యతల నుంచి మెలిండా తప్పుకున్న సమయంలో, ఆమె స్వతంత్ర సేవా కార్యక్రమాల కోసం బిల్ గేట్స్ అదనంగా 12.5 బిలియన్ డాలర్లను కేటాయించినట్లు సమాచారం.