NVIDIA: ఎన్విడియాకు రికార్డు ఆదాయం.. రూ.80 బిలియన్ షేర్ బైబ్యాక్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ నివిడియా(NVIDIA)మరోసారి భారీ ఆర్థిక ఫలితాలతో మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. ఏప్రిల్ 26తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ 81.6బిలియన్ డాలర్ల రికార్డు ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 20 శాతం ఎక్కువ. ముఖ్యంగా డేటా సెంటర్ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయం 75.2 బిలియన్ డాలర్లకు చేరి కొత్త రికార్డు సృష్టించింది. ఈ బలమైన ఫలితాల నేపథ్యంలో కంపెనీ 80 బిలియన్ డాలర్ల షేర్ బైబ్యాక్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఎన్విడియా సీఎఫ్‌వో కోలెట్ క్రెస్ మాట్లాడుతూ,కంపెనీ అభివృద్ధి చేసిన బ్లాక్‌వెల్ ఆర్కిటెక్చర్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రధాన హైపర్‌స్కేలర్లు,క్లౌడ్ సేవల సంస్థలు,ఏఐ మోడల్ తయారీ సంస్థలు ఈ టెక్నాలజీని ఇప్పటికే ఉపయోగిస్తున్నాయని వెల్లడించారు.
వివరాలు
భారీగా పెరిగిన ప్రైవేట్ కంపెనీల్లో ఎన్విడియా పెట్టుబడులు
అయితే ప్రస్తుత త్రైమాసికంలో భారీ వృద్ధి నమోదైనా.. వచ్చే త్రైమాసికానికి ఆదాయ వృద్ధి కొంత మందగించే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేసింది. తదుపరి త్రైమాసికంలో 91 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని,ఇది ప్రస్తుతం నమోదైన ఆదాయంతో పోలిస్తే 12 శాతం పెరుగుదల మాత్రమేనని తెలిపింది. ఇక ప్రైవేట్ కంపెనీల్లో ఎన్విడియా పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. మార్కెట్‌లో లిస్టింగ్ కాని ఈక్విటీ సెక్యూరిటీల రూపంలో కంపెనీ పెట్టుబడులు జనవరిలో 22 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఏప్రిల్ నాటికి 43 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇందులో ఎక్కువ భాగం 18.5 బిలియన్ డాలర్ల కొత్త పెట్టుబడులే కావడం విశేషం. గత త్రైమాసికంలో ఇలాంటి పెట్టుబడులు కేవలం 649 మిలియన్ డాలర్లే ఉండటం గమనార్హం.
వివరాలు
ఓపెన్‌ఏఐలో పెట్టుబడిగా 30 బిలియన్ డాలర్లు
అయితే ఈ 43 బిలియన్ డాలర్ల పెట్టుబడుల లెక్కలో ఇటీవల పబ్లిక్ కంపెనీలైన కార్నింగ్, ఐరెన్‌లో చేసిన పెట్టుబడులు, అలాగే ఇంకా పూర్తికాని ఒప్పందాలు మాత్రం చేర్చలేదు. ముఖ్యంగా ఓపెన్‌ఏఐలో పెట్టుబడిగా 30 బిలియన్ డాలర్లు పెట్టనున్నట్లు ఎన్విడియా ఫిబ్రవరిలో ప్రకటించింది. అయితే ఆ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.