Oil Prices: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు (Crude Oil Prices) పైకి కదిలాయి. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా చమురు శుద్ధి కర్మాగారంపై దాడి చేసినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించడంతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా చమురు మిగులు నిల్వలు ఏర్పడే అవకాశం ఉందన్న అంచనాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 95 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. మరోవైపు, భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు వెల్లడించే దేశీయ క్రూడ్ ఆయిల్ బాస్కెట్ ధర నవంబర్ 24, 2026 నాటికి బ్యారెల్‌కు 86.73 డాలర్లుగా నమోదైంది.
వివరాలు
నవంబర్ 29న ఒపెక్ ప్లస్ దేశాల మంత్రుల సమావేశం
అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం.. నవంబర్ నెలలో ఆ తేదీ వరకు నమోదైన రోజువారీ ధరల సగటు ఆధారంగా ఈ విలువను నిర్ణయించారు.
ఇదిలా ఉండగా,చమురు ఉత్పత్తి విధానంపై చర్చించేందుకు ఒపెక్ ప్లస్ (OPEC+) దేశాల మంత్రులు నవంబర్ 29న సమావేశం కానున్నారు.
2027లో చమురు ఉత్పత్తిని ఏ స్థాయిలో కొనసాగించాలనే అంశంపై ఈ భేటీలో చర్చించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా అవసరానికి మించి ఉండే అవకాశం ఉందన్న ఆందోళనలు ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఈ నెలలో అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA)విడుదల చేసిన నివేదిక తర్వాత ప్రపంచ మార్కెట్‌లో చమురు మిగులు నిల్వలు ఏర్పడతాయన్న అంచనాలు బలపడ్డాయని,దీంతో ధరలు పెద్దగా పెరగకుండా నియంత్రణలో ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.