Gold Price Today: నేడు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించే ఉత్తమ మార్గంగా పెట్టుబడిదారులు బంగారాన్ని భావిస్తున్నారు. ఈ కారణంగా పసిడిపై డిమాండ్ పెరిగి, అది ప్రధాన పెట్టుబడి సాధనంగా మారుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. శుక్రవారం విడుదలైన వివరాల ప్రకారం దేశంలో 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.15,301గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,026కి చేరుకుంది. 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.11,476గా ఉంది.
వివరాలు
వెండి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,53,160గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,410గా నమోదైంది. ఆర్థిక కేంద్రంగా పేరుగాంచిన ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,53,010గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,40,260గా ఉంది. హైదరాబాద్,విజయవాడ నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధరల విషయానికి వస్తే ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.2,70,100కు చేరుకుంది. అయితే హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,74,900గా నమోదైంది. బంగారం, వెండి ధరలు రోజువారీగా మారుతూ ఉంటాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు తాజా ధరలను పరిశీలించడం అవసరం.