Anthropic IPO: OpenAI ప్రత్యర్థి ఆంత్రోపిక్ వచ్చే ఏడాది IPOకి సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్, అమెజాన్ మద్దతుతో పని చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్ట్‌అప్ అయిన ఆంత్రోపిక్ (Anthropic) వచ్చే సంవత్సరం IPO (Initial Public Offering) ద్వారా పబ్లిక్ మార్కెట్‌లోకి రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం, ఈ ప్రక్రియలో సహాయం కోసం కంపెనీ లా ఫర్మ్ Wilson Sonsiniను హయ్యర్ చేసింది. IPO ద్వారా Anthropic మరింత సులభంగా మూలధనం సమీకరించుకోవచ్చు..పెద్ద ఆక్విజిషన్స్ కోసం పబ్లిక్ షేర్లను ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే 3 లక్షల పైగా బిజినెస్, ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లను కలిగిన ఆంత్రోపిక్, ఓపెన్ఏఐ కి ప్రధాన పోటీదారు.
కొనసాగుతున్న చర్చలు
ఆంత్రోపిక్ IPO చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయి
ప్రస్తుతం IPOపై చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయి. Anthropic పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులతో కూడా IPO కోసం మార్గదర్శక చర్చలు జరిపింది. అయితే, ఈ చర్చలు ఇంకా సార్వత్రికమయినవి కాదని, ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఫైనాన్షియల్ టైమ్స్ తెలిపారు. "మన రకమైన స్థాయి, ఆదాయంతో పని చేసే కంపెనీలు, సాధారణంగా పబ్లిక్‌గా ట్రేడింగ్ అవుతున్నట్లు ప్రవర్తించడం సాధారణంగా జరుగుతుంది" అని కంపెనీ ప్రతినిధి ఒకసారి చెప్పారు.
ఆర్థిక దృక్పథం
ఆంత్రోపిక్ మూల్యాంకనం, ఆదాయ అంచనాలు
Anthropic విలువ ప్రస్తుతం సుమారు $350 బిలియన్ కు చేరింది. ఇది సెప్టెంబర్‌లోని $183 బిలియన్ నుండి రెండింతల పెరుగుదల. Microsoft, NVIDIAలతో కలిపి $15 బిలియన్ పెట్టుబడితో AI సామర్ధ్యాలను విస్తరించడానికి ఈ స్ర్టాటజిక్ భాగస్వామ్యం కారణంగా ఈ పెరుగుదల వచ్చింది. 2021లో మాజీ OpenAI ఉద్యోగులు స్థాపించిన ఈ కంపెనీ, వచ్చే సంవత్సరం వార్షిక ఆదాయాన్ని సుమారు $26 బిలియన్ల వరకు, ఇప్పటి కంటే దాదాపు రెండు లేదా మూడు రెట్లు పెంచే అవకాశముందని అంచనా వేస్తున్నారు.