OpenAI: ఆరోగ్య సమస్యలతో ఓపెన్‌ఏఐ ఏజీఐ డిప్లాయ్‌మెంట్ చీఫ్ ఫిడ్జీ సిమో రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
ఓపెన్‌ఏఐలో కీలక మార్పు చోటుచేసుకుంది. కంపెనీలో నంబర్-2 అధికారిగా, ఏజీఐ డిప్లాయ్‌మెంట్ చీఫ్‌గా పనిచేస్తున్న ఫిడ్జీ సిమో తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై ఆమె పార్ట్‌టైమ్ సలహాదారుగా (అడ్వైజరీ రోల్) సేవలు అందించనున్నారు. ఊహించిన దానికంటే వైద్య సెలవలు ఎక్కువ కాలం కొనసాగడం, ఆరోగ్య సమస్యలు మరింత క్లిష్టంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫిడ్జీ సిమో 2025 మేలో ఓపెన్‌ఏఐలో కొత్తగా సృష్టించిన "సీఈఓ ఆఫ్ అప్లికేషన్స్" హోదాలో చేరారు. ఈ పదవి నేరుగా ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌కు నివేదించే స్థాయిలో ఉండేది. అనంతరం ఆమె హోదాను "సీఈఓ ఆఫ్ ఏజీఐ డిప్లాయ్‌మెంట్"గా మార్చారు.
వివరాలు
కంపెనీ నుంచి నిష్క్రమించిన కెవిన్ వైల్
ఈ ఏడాది ఏప్రిల్‌లో న్యూరో-ఇమ్యూన్ సంబంధిత వ్యాధి మళ్లీ తిరగబెట్టిందని ఫిడ్జీ సిమో స్వయంగా వెల్లడించారు. అదే సమయంలో కంపెనీ నిర్వహణలోనూ పలు మార్పులు జరిగాయి. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బ్రాడ్ లైట్‌క్యాప్‌కు ప్రత్యేక ప్రాజెక్టుల బాధ్యతలు అప్పగించగా,చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కేట్ రౌచ్ క్యాన్సర్ చికిత్సపై దృష్టి పెట్టేందుకు సంస్థను వీడారు. మరో కీలక అధికారి కెవిన్ వైల్ కూడా అనంతరం కంపెనీ నుంచి నిష్క్రమించారు. ఓపెన్‌ఏఐలో చేరకముందు ఫిడ్జీ సిమో 2021 నుంచి ఇన్‌స్టాకార్ట్ సీఈఓగా పనిచేశారు. ఆమె నాయకత్వంలోనే 2023లో ఆ సంస్థ ఐపీఓ విజయవంతంగా పూర్తైంది. అంతకుముందు దశాబ్దానికి పైగా మెటాలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె, ఫేస్‌బుక్ యాప్ విభాగానికి కూడా నాయకత్వం వహించారు.
వివరాలు
గత డిసెంబరులో ఓపెన్‌ఏఐలో చేరిన ఫిడ్జీ సిమో
ఫిడ్జీ సిమో నిష్క్రమణతో ఓపెన్‌ఏఐలో కీలక నాయకత్వ మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. భవిష్యత్‌లో ఐపీఓపై కంపెనీ దృష్టి సారిస్తుండగా,ఏఐ రంగంలో ఆంత్రోపిక్ వంటి సంస్థలతో పోటీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అందించే ఉత్పత్తుల విస్తరణపై ఆమె ప్రధానంగా దృష్టి పెట్టినా,గత ఏడాది చివర్లో అంతర్గత ఆదాయ లక్ష్యాలు పూర్తిగా చేరుకోకపోవడంతో కంపెనీ కోడింగ్ టూల్స్ అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం శామ్ ఆల్ట్‌మన్,బ్రాడ్ లైట్‌క్యాప్,సారా ఫ్రియర్,సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మన్‌లతో పాటు చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ డెనిస్ డ్రెస్సర్ కూడా సంస్థ ఎగ్జిక్యూటివ్ బృందంలో ఉన్నారు. గత డిసెంబరులో ఓపెన్‌ఏఐలో చేరిన ఆమె, ఎంటర్‌ప్రైజ్ వ్యాపారం, కస్టమర్ సక్సెస్, ప్రపంచవ్యాప్త ఆదాయ వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు.
వివరాలు
ఉద్యోగుల ఈక్విటీ విధానంలో కూడా ఓపెన్‌ఏఐ కీలక మార్పులు
గతంలో స్లాక్ సీఈఓగా పనిచేయడంతో పాటు, దాని మాతృసంస్థ సేల్స్‌ఫోర్స్‌లో 14 సంవత్సరాల అనుభవం ఉన్న నేపథ్యంలో ఆమెకు మరింత విస్తృత బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా,ఉద్యోగుల ఈక్విటీ విధానంలో కూడా ఓపెన్‌ఏఐ ఇటీవల కీలక మార్పులు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఈక్విటీ వెస్టింగ్‌కు అవసరమైన 12నెలల కాలాన్ని ఆరు నెలలకు తగ్గించింది. అనంతరం డిసెంబరులో కొత్తగా చేరే ఉద్యోగుల కోసం ఆ నిబంధనను పూర్తిగా తొలగించి,ఉద్యోగంలో చేరిన మొదటి రోజునుంచే ఈక్విటీ వెస్టింగ్ ప్రారంభమయ్యేలా నిర్ణయించింది. ఏఐ రంగంలో ప్రతిభావంతుల కోసం పెరుగుతున్న పోటీ నేపథ్యంలో, ఉద్యోగులు ఈక్విటీ కోల్పోతామనే భయం లేకుండా కొత్త అవకాశాలను స్వీకరించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫిడ్జీ సిమో చేసిన ట్వీట్
Today, I shared with the OpenAI team that I have decided to leave my full-time role at OpenAI and transition to being a part-time advisor.
— Fidji Simo (@fidjissimo) July 9, 2026
Three months ago, I had to go on medical leave after a severe exacerbation of a chronic illness I’ve lived with for seven years. During that…