Loading...
Oracle layoffs: ఒరాకిల్‌లో సైలెంట్ లేఆఫ్‌లు.. మాయమవుతున్న ఉద్యోగుల స్లాక్ ఖాతాలు
ఒరాకిల్‌లో సైలెంట్ లేఆఫ్‌లు.. మాయమవుతున్న ఉద్యోగుల స్లాక్ ఖాతాలు

Oracle layoffs: ఒరాకిల్‌లో సైలెంట్ లేఆఫ్‌లు.. మాయమవుతున్న ఉద్యోగుల స్లాక్ ఖాతాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2026
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకునేందుకు టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి గతంలో మాదిరిగా ఉద్యోగులకు ముందస్తు సంకేతాలు ఇవ్వకుండా, నిశ్శబ్దంగా తొలగింపులు చేపడుతున్నట్లు సమాచారం. సాధారణంగా ఉదయం 6 గంటల సమయంలో వచ్చే లేఆఫ్ మెయిల్స్ ఈసారి కనిపించకపోయినా.. ఉద్యోగుల 'స్లాక్' ఖాతాలు మాత్రం ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయనే ప్రచారం మొదలైంది. ఈ అంశంపై 'r/employeesOfOracle' పేరుతో ఉన్న రెడిట్ ఖాతాలో 'Layoffs Started in US' అనే థ్రెడ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఒరాకిల్ అంతర్గత కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే స్లాక్‌లో.. లేఆఫ్‌కు గురైన ఉద్యోగుల ఖాతాలు క్రమంగా కనిపించకుండా పోతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

వివరాలు 

ఒక్కసారిగా సమాచారం ఇవ్వడం లేదు..

తొలగింపులకు గురైన ఉద్యోగులందరికీ ఒకేసారి సందేశాలు పంపడం లేదని తెలుస్తోంది.

అయినప్పటికీ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైందనే వార్తలు వినిపిస్తున్నాయి.

లేఆఫ్‌కు గురైన తర్వాత ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే సంబంధిత ఉద్యోగుల స్లాక్ యాక్సెస్‌తో పాటు కంపెనీ ఈమెయిల్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు సమాచారం.

తొలగింపులపై ఒరాకిల్ నుంచి అధికారికంగా స్పష్టత లేకపోవడంతో.. మిగిలిన ఉద్యోగులు తమ స్లాక్ గ్రూపుల్లో సభ్యుల సంఖ్యను పరిశీలిస్తున్నారట.

ఎవరెవరి ఖాతాలు కనిపించకుండా పోతున్నాయి? గ్రూప్‌లో సభ్యుల సంఖ్య ఎంత తగ్గింది? అనే విషయాలను గమనిస్తూ.. కోతల తీవ్రతను అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

అప్లికేషన్ ల్యాబ్స్‌లోనూ కీలక పదవులకు కోతలు?

ఒరాకిల్‌కు చెందిన అప్లికేషన్ ల్యాబ్స్ బృందంలో పనిచేస్తున్న వైస్ ప్రెసిడెంట్స్ (VP), గ్రూప్ వైస్ ప్రెసిడెంట్స్ (GVP) స్థాయి ఉద్యోగులు కూడా తమ పదవులు కోల్పోయినట్లు సమాచారం.

ఈ బృందాన్ని ఇటీవలే ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (OCI)లో విలీనం చేసిన విషయం తెలిసిందే.

తాజా ఉద్యోగుల కోతలతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 7,000 నుంచి 10,000 మంది వరకు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.

భారత్‌లోనూ పలు విభాగాలకు చెందిన మేనేజర్లు ఈ లేఆఫ్‌ల జాబితాలో ఉన్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

మార్చిలో 10 వేల మందికి కోతలు..

ఈ ఏడాది మార్చిలోనూ ఒరాకిల్ భారీ స్థాయిలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది.

అప్పట్లో సుమారు 10 వేల మంది సిబ్బందిని తొలగించినట్లు వార్తలు వచ్చాయి.

మార్చి 1న ఉదయం 6 గంటల సమయంలో అమెరికా, భారత్, కెనడాలోని ఉద్యోగులకు లేఆఫ్‌కు సంబంధించిన ఈమెయిల్స్ పంపినట్లు సమాచారం.

అందుకే ఈసారి కూడా సెప్టెంబర్ 1న ఉదయం అదే సమయంలో ఉద్యోగులకు తొలగింపు మెయిల్స్ వస్తాయని పలువురు భావించారు.

అయితే అలా జరగకపోవడంతో ఒరాకిల్ ఈసారి భిన్నమైన విధానాన్ని అనుసరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

మీడియా దృష్టికి రాకుండా..

ఉద్యోగుల తొలగింపులు మీడియా దృష్టిలో పడకుండా, సంస్థపై విమర్శలు రాకుండా ఉండేందుకే ఒరాకిల్ ఈసారి 'సైలెంట్ లేఆఫ్' విధానాన్ని అనుసరిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ తాజా తొలగింపులపై ఒరాకిల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ADVERTISEMENT