Loading...
OpenAI : ఓపెన్ ఏఐ నుంచి 'Astra'.. అత్యంత శక్తిమంతమైన కొత్త AI మోడల్ విడుదల
ఓపెన్ ఏఐ నుంచి 'Astra'.. అత్యంత శక్తిమంతమైన కొత్త AI మోడల్ విడుదల

OpenAI : ఓపెన్ ఏఐ నుంచి 'Astra'.. అత్యంత శక్తిమంతమైన కొత్త AI మోడల్ విడుదల

వ్రాసిన వారు Moogati Shabari
Sep 04, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

OpenAI గురువారం 'Astra' పేరుతో తన సరికొత్త AI మోడల్‌ను విడుదల చేసింది. ఇప్పటివరకు తాము రూపొందించిన మోడళ్లలో ఇదే అత్యంత శక్తిమంతమైనది, అత్యధిక సామర్థ్యం కలిగినదని సంస్థ వెల్లడించింది. కంప్యూటర్, బ్రౌజర్ వినియోగంలో Astra సరికొత్త శకానికి నాంది పలుకుతుందని OpenAI పేర్కొంది. వేగం, కచ్చితత్వం, భద్రత విషయంలో ఈ మోడల్‌కు సాటిలేదని తెలిపింది. ప్రస్తుతం OpenAI సైబర్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్ 'Daybreak'ను ఉపయోగిస్తున్న కస్టమర్లకు Astra అందుబాటులోకి వచ్చింది. వచ్చే వారం నుంచి Pro, Plus, Enterprise, Business వంటి చెల్లింపు ప్లాన్ల వినియోగదారులకు కూడా ఈ మోడల్ అందుబాటులోకి రానుంది. API ద్వారా కూడా Astraను ఉపయోగించుకునే అవకాశం కల్పించనున్నారు.

వివరాలు

Astraతో కీలక మార్పు..

గురువారం మీడియాతో జరిగిన సమావేశంలో OpenAI అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మన్ మాట్లాడుతూ.. Astra తమ సంస్థ రూపొందించిన "అత్యంత తెలివైన, ముఖ్యంగా అత్యంత మెరుగ్గా అలైన్‌ అయిన మోడల్" అని పేర్కొన్నారు.

ఎన్నో ఏళ్లుగా చేసిన పరిశోధనలు, తీసుకున్న కీలక నిర్ణయాల ఫలితమే Astra అని చెప్పారు.

ప్రతి సాంకేతిక పురోగతి తర్వాతి దానికి పునాదిగా మారిందని, AIకి ఎలాంటి పనులను అప్పగించవచ్చు, అది మనుషుల సామర్థ్యాలను ఎలా పెంచగలదనే విషయంలో Astra ఒక కీలక మార్పును తీసుకువస్తుందని అన్నారు.

Astra సైబర్‌ సామర్థ్యాలపై ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతోంది.

వివరాలు

వినియోగదారులకు సురక్షితమైన అనుభవం..

ఈ మోడల్‌లో తీసుకొచ్చిన కొత్త సామర్థ్యాలతో పాటు, వినియోగదారులకు సురక్షితమైన అనుభవం అందించేందుకు అమలు చేసిన కొత్త భద్రతా చర్యల గురించి OpenAI ఈ వారం ప్రారంభంలోనే ఓ బ్లాగ్‌లో వివరించింది.

Astra సామర్థ్యాలను నిర్ధారించేందుకు వివిధ సెక్యూరిటీ బెంచ్‌మార్క్‌లపై పరీక్షించినట్లు సంస్థ తెలిపింది.

ముఖ్యంగా జీరో-డే లోపాలను గుర్తించి, వాటిని ఉపయోగించుకునే మార్గాలను అభివృద్ధి చేయగల సామర్థ్యం సెక్యూరిటీ నిపుణులకు లోపాలను గుర్తించి, వాటిని సరిచేయడంలో సహాయపడుతుందని పేర్కొంది.

మోడల్ 'అలైన్‌మెంట్‌'పై OpenAI ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అంటే వినియోగదారు కోరుకున్న విధంగా లేదా వినియోగదారుడి ప్రయోజనాలకు అనుగుణంగా AI వ్యవహరించేలా చేయడం.

ఇటీవల జరిగిన Hugging Face భద్రతా ఉల్లంఘన నేపథ్యంలో OpenAI ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.

ADVERTISEMENT

వివరాలు

Microsoftతో OpenAI కుదుర్చుకున్న ఒప్పందం..

దీనిపై బ్రాక్‌మన్ స్పందిస్తూ.. AGIకి సంబంధించిన గతంలో ఉన్న ఒప్పందపరమైన నిబంధన ఇకపై లేదని చెప్పారు.

అందువల్ల 'కాంట్రాక్చువల్ AGI' అనే భావన ప్రస్తుతం వర్తించదని అన్నారు.

గతంలో Microsoftతో OpenAI కుదుర్చుకున్న ఒప్పందంలో AGI సాధించిన తర్వాత ఇరు సంస్థల భాగస్వామ్యం ముగిసేలా ఓ నిబంధన ఉండేది.

అయితే ఆ నిబంధన ఇప్పుడు లేదని బ్రాక్‌మన్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం AGI నిర్వచనం ఒక ఒప్పందపరమైన బాధ్యత నుంచి "మిషన్ కాన్సెప్ట్ లేదా ఆధ్యాత్మిక భావన"గా మారిందని బ్రాక్‌మన్ వివరించారు.

అయితే వ్యక్తిగతంగా తన అభిప్రాయం ప్రకారం.. "మనం ఇప్పటికే ఆ స్థాయికి చేరుకున్నామని నేను భావిస్తున్నాను" అని బ్రాక్‌మన్ పేర్కొన్నారు.

ADVERTISEMENT