Loading...
Henry Crocombe: వారం వ్యవధిలోనే రెండు హ్యాట్రిక్స్‌.. క్రికెట్‌లో అరుదైన రికార్డు!
వారం వ్యవధిలోనే రెండు హ్యాట్రిక్స్‌.. క్రికెట్‌లో అరుదైన రికార్డు!

Henry Crocombe: వారం వ్యవధిలోనే రెండు హ్యాట్రిక్స్‌.. క్రికెట్‌లో అరుదైన రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 04, 2026
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించడం అంత సులభమైన విషయం కాదు. అలాంటిది ఒకే వారంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ నమోదు చేయడం అత్యంత అరుదైన ఘనత. ఇంగ్లండ్ యువ పేసర్ హెన్రీ క్రోకోంబ్ ఇప్పుడు ఈ సంచలన రికార్డును సాధించాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సస్సెక్స్ తరఫున ఆడుతున్న 24 ఏళ్ల క్రోకోంబ్.. వరుస కౌంటీ మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌లు సాధించి అరుదైన రికార్డు జాబితాలో చోటు సంపాదించాడు.

వివరాలు

వారం వ్యవధిలోనే రెండు హ్యాట్రిక్‌లు

ఆగస్టు చివరి వారంలో సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రోకోంబ్ తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు. అదే మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతోనూ అదరగొట్టాడు.

ఆ హ్యాట్రిక్ జ్ఞాపకం ఇంకా చెరిగిపోకముందే మరోసారి అదే ఫీట్‌ను పునరావృతం చేశాడు.

గురువారం ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వారం వ్యవధిలోనే తన రెండో హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు.

ఏడో బౌలర్‌గా రికార్డు

వరుస ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌లు సాధించిన బౌలర్ల జాబితాలో క్రోకోంబ్ ఏడో ఆటగాడిగా నిలిచాడు.

ఈ అరుదైన జాబితాలో జార్జ్ ఫ్రీమన్(1868), జోగిందర్ రావు (1963), మైక్ ప్రాక్టర్ (1979), డీన్ హెడ్లీ (1996), వసీం అక్రమ్ (1999), దీపక్ ధపోలా(2024) ఇప్పటికే ఉన్నారు. ఇప్పుడు వారి సరసన హెన్రీ క్రోకోంబ్ కూడా చేరాడు.

వివరాలు

సూపర్ ఫామ్‌లో యువ పేసర్

సస్సెక్స్ అకాడమీ నుంచి వచ్చిన క్రోకోంబ్.. ప్రస్తుత కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-1లో అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు.

తొలి 11 మ్యాచ్‌ల్లోనే 43 వికెట్లు పడగొట్టి సస్సెక్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 79 ఇన్నింగ్స్‌లు ఆడిన క్రోకోంబ్ 118 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

వరుస హ్యాట్రిక్‌లతో పాటు ప్రస్తుత సీజన్‌లో అతడి అద్భుతమైన గణాంకాల నేపథ్యంలో.. ఇంగ్లండ్ జాతీయ జట్టు నుంచి పిలుపు కోసం ఈ యువ పేసర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

ADVERTISEMENT