LOADING...
Oregon: పారామౌంట్-వార్నర్ బ్రదర్స్ విలీనంపై ఒరెగాన్ వెనక్కి
పారామౌంట్-వార్నర్ బ్రదర్స్ విలీనంపై ఒరెగాన్ వెనక్కి

Oregon: పారామౌంట్-వార్నర్ బ్రదర్స్ విలీనంపై ఒరెగాన్ వెనక్కి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2026
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

హాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన 110 బిలియన్ డాలర్ల పారామౌంట్-వార్నర్ బ్రదర్స్ విలీన ఒప్పందం మరో కీలక మలుపు తిరిగింది. ఈ విలీనాన్ని ఆలస్యం చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికాలోని ఒరెగాన్ అటార్నీ జనరల్ ఉపసంహరించుకున్నారు. 'ప్రాజెక్ట్ వారియర్'కు సంబంధించిన కొన్ని అంతర్గత పత్రాలు, అలాగే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన లాబీయింగ్ వివరాలను అందించేందుకు పారామౌంట్ నిరాకరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అయితే, ఈ విలీనం పూర్తిగా చట్టబద్ధమైనదని, మార్కెట్‌లో పోటీని మరింత బలోపేతం చేస్తుందని పారామౌంట్ స్పష్టం చేసింది.

వివరాలు 

జూలై 22కు ముందు ఈ విలీన ప్రక్రియను పూర్తి చేయబొం: పారామౌంట్

ఇదిలా ఉండగా, జూలై 22కు ముందు ఈ విలీన ప్రక్రియను పూర్తి చేయబోమని పారామౌంట్ మరోసారి హామీ ఇచ్చింది. ఒరెగాన్ పిటిషన్ ఉపసంహరణ నిర్ణయాన్ని స్వాగతించిన సంస్థ, ఈ పరిణామంతో సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, ఈ విలీనం కారణంగా హాలీవుడ్‌లో పెద్ద మీడియా సంస్థల ఏకీకరణ మరింత పెరిగి, ఉద్యోగాల కోతలు జరిగే అవకాశం ఉందని నటులు, రచయితలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

విలీనంపై ఇతర అమెరికా రాష్ట్రాల పరిశీలన 

మరోవైపు, ఈ విలీన ప్రతిపాదనపై అమెరికాలోని ఇతర రాష్ట్రాలు ఇంకా సమీక్ష కొనసాగిస్తున్నాయి. పోటీ వాతావరణంపై ఈ ఒప్పందం ప్రభావం చూపుతుందా అనే అంశాన్ని అవి పరిశీలిస్తున్నాయి. అవసరమైతే వచ్చే వారంలోనే ఈ విలీనాన్ని అడ్డుకునే చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దీంతో హాలీవుడ్‌లోని అతిపెద్ద స్టూడియోలకు సంబంధించిన ఈ మెగా విలీనంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Advertisement