LOADING...
Paytm: ₹20తోనే వెండి సేవింగ్స్.. Paytm కొత్త ఫీచర్ లాంచ్
₹20తోనే వెండి సేవింగ్స్.. Paytm కొత్త ఫీచర్ లాంచ్

Paytm: ₹20తోనే వెండి సేవింగ్స్.. Paytm కొత్త ఫీచర్ లాంచ్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2026
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

పేటియం యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'Paytm Silver' పేరుతో కొత్త ఫీచర్‌ను లాంచ్ చేస్తూ, కేవలం 20 రూపాయల నుంచే వెండిలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికే 'Paytm Gold' మంచి స్పందన పొందిన నేపథ్యంలో, ఇప్పుడు వెండి సేవింగ్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది సంస్థ. చిన్న మొత్తాలతో ఆస్తి ఆధారిత సేవింగ్స్ చేసుకునే అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

వివరాలు 

ప్రస్తుత మార్కెట్ ధరలకు అమ్ముకునే సౌకర్యం

ఈ వెండి మొత్తం దేశంలో విశ్వసనీయ రిఫైనర్‌గా పేరున్న MMTC-PAMP నుంచి సేకరించబడుతుందని వెల్లడించింది. యూజర్లు యాప్‌లోనే ప్రస్తుత మార్కెట్ ధరలకు వెంటనే వెండి అమ్ముకునే సౌకర్యం కూడా ఉంటుంది. ఎలాంటి మేకింగ్ చార్జీలు లేకుండా ట్రాన్సాక్షన్ పూర్తి చేయవచ్చు. లైవ్ సిల్వర్ రేట్లు స్పష్టంగా చూపించడంతో పాటు, వర్తించే పన్నులు వేరుగా చూపిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. పండుగలు, ముఖ్య సందర్భాలు, భవిష్యత్ అవసరాల కోసం కొద్దికొద్దిగా వెండి సేవ్ చేసుకునేలా ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని పేటీఎం వెల్లడించింది.

Advertisement