LOADING...
Paytm: కొత్త యాప్ ప్రారంభించిన పేటీయం 
కొత్త యాప్ ప్రారంభించిన పేటీయం

Paytm: కొత్త యాప్ ప్రారంభించిన పేటీయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2025
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో ప్రముఖ డిజిటల్ చెల్లింపు సంస్థ పేటియం, తన ప్రధాన యాప్‌ను పూర్తిగా కొత్త రూపంలో విడుదల చేసింది. ఈ తాజా అప్‌డేట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లు, సులభమైన డిజైన్, ఇంకా వేగంగా లావాదేవీలు జరగడానికి 15కుపైగా కొత్త ఫీచర్లు చేర్చింది. ఈ యాప్ భారతీయ వినియోగదారులతో పాటు 12 దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు కూడా ఉపయోగపడేలా రూపొందించబడింది.

ప్రత్యేక లక్షణం 

'గోల్డ్ కాయిన్స్' ఫీచర్,AI ఆధారిత వ్యక్తిగత సూచనలు

ఈ కొత్త యాప్‌లో ముఖ్యంగా చర్చనీయాంశమైనది "Gold Coins" ఫీచర్. ప్రతి చెల్లింపుపై వినియోగదారులకు డిజిటల్ గోల్డ్ ఇవ్వడం ద్వారా, రోజువారీ ట్రాన్సాక్షన్లకు పొదుపు విలువను జోడించింది. అదనంగా, యాప్ వినియోగదారుల ఖర్చుల అలవాట్లను AI ద్వారా అర్థం చేసుకొని, ట్రాన్సాక్షన్లను ఆటోమేటిక్‌గా వర్గీకరిస్తుంది, అలాగే అవసరమైన వ్యక్తిగత ఫైనాన్షియల్ సూచనలు ఇస్తుంది.

వినియోగదారు అనుభవం 

బ్యాలెన్స్ హిస్టరీలో కొత్త AI ట్యాగులు

యాప్‌లో బ్యాలెన్స్ హిస్టరీని కూడా పూర్తిగా మార్చారు. ఇప్పుడు వినియోగదారులు UPI కి లింక్ అయిన అన్ని బ్యాంక్ ఖాతాల మొత్తం బ్యాలెన్స్‌ను ఒకే చోట చూడగలరు. ఖర్చులను షాపింగ్, బిల్స్, ట్రావెల్, యుటిలిటీస్ వంటి విభాగాల్లో AI ట్యాగులతో వర్గీకరిస్తుంది. ప్రైవసీ కోసం 'Hide Payments' అనే ఫీచర్ ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్లను హిస్టరీలో కనిపించకుండా దాచుకోవచ్చు.

కొత్త ఫీచర్లు

ఇంకా వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లు

కొత్త పేటీయం యాప్ ద్వారా వినియోగదారులు UPI స్టేట్మెంట్లను Excel లేదా PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 'Paytm Playback' అనే ఆసక్తికరమైన ఫీచర్, ఇటీవల చేసిన ఖర్చుల ఆధారంగా AI తయారు చేసే ర్యాప్ పాటను వినిపిస్తుంది. అలాగే, 'Magic Paste' ఫీచర్ ద్వారా WhatsApp లేదా ఇతర యాప్‌ల నుండి కాపీ చేసిన బ్యాంక్/IFSC వివరాలు ఆటోమేటిక్‌గా పేస్ట్ అవుతాయి. తరచుగా చెల్లింపులు చేసే కాంటాక్ట్స్‌కి Favorite Contacts ఫీచర్‌తో త్వరగా పేమెంట్లు చేయవచ్చు.

వృత్తిపరమైన సాధనాలు 

ఎన్ఆర్ఐల కోసం సౌకర్యాలు

12 దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు తమ అంతర్జాతీయ మొబైల్ నంబర్లతో NRE/NRO అకౌంట్లను లింక్ చేసుకొని భారతీయ రూపాయల్లో UPI ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. అంతేకాకుండా, Receive Money విడ్జెట్ ద్వారా డాక్టర్లు, ట్రైనర్లు, ఆటో/టాక్సీ డ్రైవర్లు వంటి వారు యాప్ ఓపెన్ చేయకుండానే హోమ్ స్క్రీన్ నుంచే డబ్బులు స్వీకరించగలరు.