LOADING...
Iphone Sale in India: ఐఫోన్‌ 16 కోసం ఆపిల్ స్టోర్ల ముందు క్యూ 
ఐఫోన్‌ 16 కోసం ఆపిల్ స్టోర్ల ముందు క్యూ

Iphone Sale in India: ఐఫోన్‌ 16 కోసం ఆపిల్ స్టోర్ల ముందు క్యూ 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 20, 2024
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 16 విక్రయాలు నేడు ప్రారంభమయ్యాయి. ఆపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆపిల్ స్టోర్‌ల ముందు క్యూ కట్టారు. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లోని అనేక యాపిల్ స్టోర్‌ల బయట పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు బారులు తీరారు.ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సిరీస్‌లో ఐఫోన్ 16,ఐఫోన్ 16 ప్లస్,ఐఫోన్ 16 ప్రొ,ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ వంటి నాలుగు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రత్యేకంగా కొత్తగా జోడించిన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ ఉన్నాయి. అలాగే, కొత్తగా రూపొందించిన A18 చిప్‌ను కూడా అందిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ముంబై BKC లో ఐఫోన్ అమ్మకాలు 

వివరాలు 

ఐఫోన్ ధరలు  

ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,900, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900, ఐఫోన్ 16 ప్రొ ప్రారంభ ధర రూ. 1,19,900, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,44,900గా నిర్ణయించబడ్డాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీ సాకేత్ లో ఐఫోన్ అమ్మకాలు