Petrol, Diesel Prices Hike: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు.. వారంలో ఇది రొండోసారి
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు మళ్లీ పెంచాయి. లీటరు పెట్రోల్, డీజిల్‌పై సుమారు 90 పైసల వరకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ఇంధన ధరలు పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ప్రభుత్వ చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరిగినట్లు తెలుస్తోంది. ఇదే కారణంగా నాలుగు రోజుల క్రితం కూడా లీటరు పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున ధరలు పెంచిన విషయం తెలిసిందే.
వివరాలు
క్సైజ్ సుంకాన్ని తాత్కాలికంగా నిలిపేసిన కేంద్ర ప్రభుత్వం
ఇక ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వసూలు చేసే ఎక్సైజ్ సుంకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అయినప్పటికీ మరోసారి ధరలు పెరగడం గమనార్హంగా మారింది. తాజా పెంపుతో దిల్లీలో పెట్రోల్ ధర రూ.98.64కు చేరగా, కోల్‌కతాలో రూ.109.70, ముంబయిలో రూ.107.59, చెన్నైలో రూ.104.49గా నమోదైంది. అలాగే డీజిల్ ధరలు దిల్లీలో రూ.91.58, కోల్‌కతాలో రూ.96.07, ముంబయిలో రూ.94.08, చెన్నైలో రూ.96.11కు చేరుకున్నాయి.