Loading...
PhonePe: మార్చి నాటికి ఫోన్‌పే ఐపీఓ.. రూ.14 వేల కోట్ల సమీకరణే లక్ష్యం!
మార్చి నాటికి ఫోన్‌పే ఐపీఓ.. రూ.14 వేల కోట్ల సమీకరణే లక్ష్యం!

PhonePe: మార్చి నాటికి ఫోన్‌పే ఐపీఓ.. రూ.14 వేల కోట్ల సమీకరణే లక్ష్యం!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌ పే తన తొలి పబ్లిక్ ఆఫర్‌ (ఐపీఓ) ప్రక్రియను తిరిగి ప్రారంభించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నాటికి స్టాక్ మార్కెట్లలో కంపెనీ షేర్లను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ విలువను 12 నుంచి 15 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నట్లు మర్చంట్ బ్యాంకర్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సవరించిన ముసాయిదా పత్రాలను త్వరలోనే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించే అవకాశం ఉందని సమాచారం. ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో ఉండనుంది. అంటే కంపెనీ కొత్తగా షేర్లను జారీ చేయకుండా,ఇప్పటికే వాటాలు కలిగి ఉన్న మదుపర్లు తమ షేర్లను విక్రయించనున్నారు.

వివరాలు 

ఐపీఓ సన్నాహాలపై దృష్టి

ఈ ప్రక్రియ ద్వారా రూ.12,000కోట్ల నుంచి రూ.14,000కోట్ల వరకు నిధులు సమీకరించే అవకాశం ఉందని మర్చంట్ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు.

నిజానికి ఫోన్‌పే గతంలోనే ఐపీఓకు వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

అయితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు,ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో బలహీనత,స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు వంటి కారణాలతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది.

ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు రావడంతో కంపెనీ మళ్లీ ఐపీఓ సన్నాహాలపై దృష్టి సారించింది.

ముఖ్యంగా విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) భారత స్టాక్ మార్కెట్లలో తిరిగి కొనుగోళ్లు ప్రారంభించడం,మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనడం కంపెనీకి కలిసివచ్చే అంశాలుగా మారాయి.

దీనికి తోడు ఫోన్‌పే వ్యాపార కార్యకలాపాలు కూడా పుంజుకోవడంతో ఐపీఓ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT