LOADING...
Post Office: బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ.. ప్రభుత్వ గ్యారంటీతో సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్!
బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ.. ప్రభుత్వ గ్యారంటీతో సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్!

Post Office: బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ.. ప్రభుత్వ గ్యారంటీతో సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2026
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఎంత అవసరమో,సంపాదించిన డబ్బును భద్రంగా పెట్టుబడి పెట్టడం కూడా అంతే కీలకం. స్టాక్ మార్కెట్‌లోని హెచ్చుతగ్గులు లేదా ప్రైవేట్ బ్యాంకులపై ఉన్న అనిశ్చితి కారణంగా ఆందోళన చెందుతున్న వారికి భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ పోస్ట్ విశ్వసనీయమైన పెట్టుబడి మార్గాన్ని అందిస్తోంది. ప్రభుత్వ భరోసాతో లాభాలు పొందాలని ఆశించే వారికి పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ పథకం ఎంతో అనుకూలంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఐదేళ్ల వ్యవధి గల ఈస్కీమ్ సాధారణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. బ్యాంకుల్లో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ మాదిరిగానే ఇది పనిచేస్తుంది.కేంద్ర ప్రభుత్వ హామీ ఉన్నందున పెట్టుబడికి పూర్తి భద్రత లభిస్తుంది. ఈ ఖాతాను కనీసం రూ.1000తో ప్రారంభించవచ్చు.గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి లేదు.

వివరాలు 

వడ్డీ రేట్ల వివరాలు

కాలవ్యవధిని అనుసరించి పోస్ట్ ఆఫీస్ క్రింది విధంగా వడ్డీని అందిస్తోంది: 1 సంవత్సరం: 6.9% వడ్డీ 2 సంవత్సరాలు: 7.0% వడ్డీ 3 సంవత్సరాలు: 7.1% వడ్డీ 5 సంవత్సరాలు: 7.5% వడ్డీ అనేక ప్రముఖ బ్యాంకులు ఐదేళ్ల కాలపరిమితిపై 6.5% నుంచి 7% లోపే వడ్డీ ఇస్తున్న నేపథ్యంలో, పోస్ట్ ఆఫీస్ 7.5% వడ్డీ అందించడం విశేషం.

వివరాలు 

కాంపౌండింగ్ ప్రయోజనం

ఈ పథకంలో వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తారు. లెక్కించిన వడ్డీని అసలుకు కలిపి మళ్లీ వడ్డీ గణిస్తారు. దీంతో సాధారణ వడ్డీ కంటే అధిక లాభం లభిస్తుంది. సంపాదించిన వడ్డీని ప్రతి సంవత్సరం మీ సేవింగ్స్ ఖాతాలో జమ చేసుకోవచ్చు లేదా మెచ్యూరిటీ వరకు కొనసాగించి మొత్తం మొత్తాన్ని ఒకేసారి పొందవచ్చు.

Advertisement

వివరాలు 

రూ.1 లక్ష పెట్టుబడి పెడితే...

ఐదేళ్ల కాలపరిమితితో రూ.1,00,000ను ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టినట్లయితే: పెట్టుబడి మొత్తం: రూ.1,00,000 సంపాదించిన వడ్డీ: రూ.44,995 మెచ్యూరిటీకి లభించే మొత్తం: రూ.1,44,995 అంటే దాదాపు సగం మొత్తానికి సమానమైన డబ్బు వడ్డీ రూపంలో అదనంగా పొందవచ్చు.

Advertisement

వివరాలు 

ముఖ్యమైన ప్రయోజనాలు

పన్ను రాయితీ: ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సమాన వడ్డీ రేట్లు: ఈ పథకంలో వయస్సుతో సంబంధం లేకుండా సీనియర్ సిటిజన్లు మరియు యువతకు ఒకే రకమైన వడ్డీ వర్తిస్తుంది. సులభంగా ప్రారంభం: మీకు సమీపంలోని ఏ పోస్ట్ ఆఫీస్‌ను సందర్శించి ఈ ఖాతాను సులభంగా ప్రారంభించవచ్చు.

Advertisement