LOADING...
PSB: 12 నుంచి 8కి తగ్గనున్న పీఎస్‌బీలు.. ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకులు విలీనం?
12 నుంచి 8కి తగ్గనున్న పీఎస్‌బీలు.. ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకులు విలీనం?

PSB: 12 నుంచి 8కి తగ్గనున్న పీఎస్‌బీలు.. ఆ నాలుగు ప్రభుత్వ బ్యాంకులు విలీనం?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 26, 2025
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల(పీఎస్‌బీ)మలివిడత విలీనం చేసే యోచనపై వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 12ప్రభుత్వ బ్యాంకులు ఉన్నప్పటికీ, వాటిలో నాలుగింటిని విలీనం చేసి మొత్తం పీఎస్‌బీల సంఖ్యను ఎనిమిదికి తగ్గించాలన్న ఆలోచన ప్రభుత్వం ఎదుర్కుంటున్నట్లు ఒక ఆంగ్ల వెబ్‌సైట్ సూచించింది. విలీనం చేయాల్సిన బ్యాంకుల్లో ఇండియన్ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌(ఐఓబీ), సెంట్రల్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఉన్నాయి. ఈ చిన్న మధ్యస్థాయి బ్యాంకులను పెద్ద బ్యాంకులు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో విలీనం చేయవచ్చని వార్తల్లో సూచిస్తున్నారు. అయితే, విలీనం ప్రక్రియకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వ అధికారుల నుంచి ఏ విధమైన అధికారిక సమాచారం అందలేదని వివిధ బ్యాంకర్లు పేర్కొన్నారు.

Details

ఆర్థిక శాఖ నుంచి ప్రతిపాదన రావడం లేదు

ఒక బ్యాంకర్ అభిప్రాయం ప్రకారం, "బ్యాంకులో మరో బ్యాంకును విలీనం చేయాలా లేదా అనేది దీర్ఘకాలిక వ్యూహంతో మాత్రమే తీసుకునే నిర్ణయం. ఇప్పటివరకు ఈ విషయంలో ఏ విధమైన అధికారిక చర్చలు జరగలేదు, ఆర్థిక శాఖ నుంచి ప్రతిపాదన కూడా రావడం లేదు. ప్రస్తుతానికి బ్యాలెన్స్‌ షీట్ల బలోపేతంపై దృష్టి సారించాం" అని చెప్పారు. అలాగే, సెబీ నిబంధనలకు అనుగుణంగా, కొన్ని బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను తగ్గించి 'కనీస ప్రజల వాటా'ను సాధించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని మరో బ్యాంకర్ తెలిపారు. మొత్తంగా, విలీన ప్రక్రియపై ఇప్పటివరకు ఏ నిర్ణయమూ అధికారికంగా తీసుకోబడలేదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల బలోపేతం, స్ట్రాటజిక్ షేర్ హోల్డింగ్ మార్పులు వంటి అంశాలపై మాత్రమే ప్రస్తుత దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement