LOADING...
Stock market crash: ఖతార్, సౌదీ దాడులు.. సెన్సెక్స్‌ 2497 పాయింట్లు పతనం
ఖతార్, సౌదీ దాడులు.. సెన్సెక్స్‌ 2497 పాయింట్లు పతనం

Stock market crash: ఖతార్, సౌదీ దాడులు.. సెన్సెక్స్‌ 2497 పాయింట్లు పతనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 19, 2026
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం కావడం, ఖతార్‌, సౌదీ ఆరామ్‌కో ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్‌ దాడులు చేయడం కారణంగా దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు మళ్లీ పెరగడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచినట్లు ప్రకటించడం స్టాక్ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ 115 డాలర్ల స్థాయిని చేరగా, బంగారం ఔన్సు 4700 డాలర్ల వద్ద స్థిరపడింది. దీని కారణంగా మూడు రోజుల లాభాలు పొందిన స్టాక్ సూచీలు పతనమయ్యాయి.

Details

సూచీల స్థితి

సెన్సెక్స్‌ ఉదయం 74,750.92 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో 73,950.95 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరికి 2,496.89 పాయింట్ల నష్టంతో 74,207.24 వద్ద ముగిసింది. నిఫ్టీ 775.65 పాయింట్ల నష్టంతో 23,002.15 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని స్టాక్స్‌ నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఎటర్నల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ కాపిటలైజేషన్ దాదాపు రూ.13 లక్షల కోట్లు క్షీణించి రూ.426 లక్షల కోట్లకు పడిపోయింది.

Details

నష్టాలకు గల కారణాలు

1. చమురు ధరల పెరుగుదల ఖతార్‌ రస్‌ లాఫాన్‌ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్‌ క్షిపణి దాడి, అలాగే సౌదీ అరామ్‌కో రిఫైనరీపై డ్రోన్‌ దాడులు కారణంగా చమురు ధరలు 115 డాలర్ల స్థాయికి చేరాయి. ఖతార్‌ నుంచి భారత్‌ కొనుగోలు చేసే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌లో 47% ఉంది, ఇది భారతీయ ఇంధన మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపింది. 2. అమెరికా ఫెడ్‌ నిర్ణయం అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం, ద్రవ్యోల్బణం ఆశించిన స్థాయికి దిగలేదని పేర్కొనడం అమెరికా మార్కెట్లను నష్టాల్లోకి తేల్చింది. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై కూడా పడ్డింది.

Advertisement

Details

3. హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల పతనం

తాత్కాలిక ఛైర్మన్‌ అతను చక్రవర్తి రాజీనామా ప్రకటించడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 9% మేర పతనమయ్యాయి. అధిక వెయిటేజీ కలిగిన షేర్ కావడం వల్ల సూచీలపై నేరుగా ప్రభావం చూపింది. 4. ఎఫ్‌ఐఐల విక్రయాలు దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ మదుపర్లు (FIIs) కొనసాగించిన విక్రయాలు కూడా సూచీలను నష్టపరిచాయి. గడిచిన 14 రోజులుగా నెట్‌ సెల్లర్‌ గా కొనసాగడం మార్కెట్‌లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టించింది. 5. లాభాల స్వీకరణ గత మూడు సెషన్లలో సూచీలు లాభాలను సాధించడంతో, అంతర్జాతీయంగా ప్రతికూల వార్తల ప్రభావంతో మదుపర్లు కొంత లాభాలను రియలైజ్‌ చేసుకోవడం సూచీలను క్షీణనకు దారితీసింది.

Advertisement