Loading...
RRB Railway Jobs 2026: 10వ తరగతి అర్హతతో రైల్వే జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి!
10వ తరగతి అర్హతతో రైల్వే జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి!

RRB Railway Jobs 2026: 10వ తరగతి అర్హతతో రైల్వే జాబ్స్.. వెంటనే అప్లై చేసుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 15, 2026
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 11,127 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు మే 15, 2026 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

వివరాలు

అర్హతలు ఇవే

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అదనంగా సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.

ప్రస్తుతం చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

వివరాలు

వయోపరిమితి

2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం:

SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు

OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జూన్ 14, 2026 రాత్రి 11:59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు

SC, ST, మాజీ సైనికులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, EBC కేటగిరీ అభ్యర్థులు - రూ.250

ఇతర అభ్యర్థులు - రూ.500

దరఖాస్తు ఫీజు SC, ST, మాజీ సైనికులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ, EBC కేటగిరీ అభ్యర్థులు - రూ.250

ఇతర అభ్యర్థులు - రూ.500

ADVERTISEMENT

వివరాలు

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపిక మొత్తం ఐదు దశల్లో జరుగుతుంది.

1. CBT-1 పరీక్ష

2. CBT-2 పరీక్ష

3. కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్

5. మెడికల్ ఎగ్జామినేషన్ ఈ అన్ని దశల్లో ప్రతిభ కనబరిచిన వారికి తుది ఎంపికలో అవకాశం లభిస్తుంది.

వేతనం

ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-2 ప్రకారం నెలకు ప్రారంభ వేతనం రూ.19,900 చెల్లించనున్నారు. అదనంగా ఇతర అలవెన్సులు కూడా అందిస్తారు.

ADVERTISEMENT

వివరాలు

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు ప్రారంభ తేదీ: మే 15, 2026

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 14, 2026

ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: జూన్ 16, 2026

దరఖాస్తు సవరణ తేదీలు

జూన్ 17 నుంచి జూన్ 26, 2026 వరకు అభ్యర్థులు అధికారిక ఆర్ఆర్‌బి వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ADVERTISEMENT