Railway stocks: రైల్వే సెక్టార్ బూస్ట్.. RVNL, IRFC, IRCTC స్టాక్ లాభాలతో ముందంజ
ఈ వార్తాకథనం ఏంటి
రైల్వే సంబంధిత స్టాక్స్‌లో ర్యాలీ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఈ స్టాక్స్‌లో పెరుగుదల కొనసాగుతున్నది, శుక్రవారమూ ఈ ఉత్సాహం నిలిచింది. రైల్వే సంబంధిత ప్రధాన స్టాక్స్‌లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC), ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), రైల్‌టెల్ ట్రేడర్లు రాణిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు RVNL స్టాక్ NSEలో 12.58% లాభంతో రూ.389.20 వద్ద కొనసాగింది. IRFC 9.27%, IRCTC 4.59%, జుపిటర్ వ్యాగన్స్ 2.85% లాభంతో ట్రేడవుతున్నాయి.
Details
ఈ ఏడాది రెండోసారి రైల్వే చార్జీల పెంపు
అనలిస్టుల ప్రకారం, రైల్వే ఛార్జీలలో సవరించిన పెంపు నేటి నుంచి అమల్లోకి రావడం రైల్వే స్టాక్స్ ర్యాలీకి ప్రధాన కారణం. ఈ ఏడాది ఇది రెండోసారి రైల్వే చార్జీల పెంపు. తాజా పెంపుతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రైల్వేకు సుమారు రూ.600 కోట్లు అదనపు ఆదాయం సమకూరనుంది. ఈ పెంపు రైల్వే సెక్టార్ అభివృద్ధికి దోహదపడుతుంది. అయితే చార్జీలు పెరగడం ప్రత్యక్షంగా రైల్వే స్టాక్స్‌కు లాభం ఇవ్వకపోయినా, రైల్వే ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే పరోక్షంగా కంపెనీలకు లబ్ధి చేరుతుంది అనే అంచనాలకే ట్రేడర్లు ఆధారపడ్డారు. అదనంగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రైల్వేతో సంబంధిత పెద్ద ఎత్తున ప్రకటనలు వచ్చే అవకాశం ఉన్నట్లు అనలిస్టులు భావిస్తున్నారు.
Details
కిలోమీటర్ కు గరిష్టంగా 2 పైసలు పెంపు
నేటి నుంచి అమలులోకి వచ్చిన రైల్వే ఛార్జీలు 215 కిలోమీటర్ల దూరానికి పైబడిన ప్రయాణానికి కిలోమీటరుకు గరిష్టంగా 2 పైసలు పెంచారు. నాన్-మెయిల్/నాన్‌ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్, సాధారణ, ఏసీ తరగతుల్లో కిలోమీటరుకు 1 పైసా పెంపు; మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ, నాన్‌ఏసీ తరగతులలో 2 పైసలు పెంపు అమలు చేయబడింది. సబర్బన్, నెలవారీ సీజన్ టికెట్లు, ఆర్డినరీ క్లాస్‌లో 215 కిలోమీటర్ల దూరాన్ని ఈ చార్జీల పెంపు నుండి మినహాయించారు.