Rajiv Bajaj: బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డుకు రాజీవ్ బజాజ్ గుడ్‌బై.. కారణాలివే
ఈ వార్తాకథనం ఏంటి
బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డు నుంచి రాజీవ్ బజాజ్ వైదొలగనున్నారు. బజాజ్ ఆటో వ్యాపారంలో పెరిగిన బాధ్యతలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్ తెలిపింది. ప్రస్తుతం రాజీవ్ బజాజ్ బజాజ్ గ్రూప్‌లోని ఆటో విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆటో మొబైల్ రంగంలోని వ్యాపార విస్తరణతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన వ్యాపారాల పర్యవేక్షణపై ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఏర్పడటంతో, గ్రూప్‌లోని ఇతర సంస్థల్లో తన బాధ్యతలను క్రమంగా తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
వివరాలు
గ్రూప్‌లోని కొత్త వ్యాపారాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ఈ నేపథ్యంలో బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డు సభ్యత్వానికి రాజీవ్ బజాజ్ వీడ్కోలు పలకనున్నారు. అలాగే జూలై 31న జరగనున్న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో తన పునర్నియామకాన్ని కోరబోనని ఆయన వెల్లడించినట్లు బజాజ్ ఫిన్‌సర్వ్ ఫైలింగ్స్‌లో పేర్కొంది. రాజీవ్ బజాజ్ ఈ నిర్ణయం ద్వారా బజాజ్ ఆటో వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, గ్రూప్‌లోని కొత్త వ్యాపారాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.